’తెలుగుదేశంపార్టీలో ఎవ్వరు కూడా కేసులకు భయపడరు’ ...

’ కేసులకు భయపడి పారిపోయేవారు టిడిపిలో ఎవరైనా ఉన్నారా తమ్ముళ్ళూ‘...

 

ఇది..చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి అడిగిన ప్రశ్నలు. నిజమే తెలుగుదేశంపార్టీలో కేసులకు భయపడే నేతలు ఎవరూ ఉండకపోవచ్చు. కానీ మరి చంద్రబాబు సంగతేమిటి ? పదేళ్ళ ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ ను వదిలిపెట్టి హఠాత్తుగా రాత్రికి రాత్రి విజయవాడకు ఎందుకు పారిపోయినట్లు ? ఓటుకునోటు కేసుకు భయపడే కదా ? అంటే ఈ కేసు చంద్రబాబును ఎంతలా భయపెట్టేసిందో అందరికీ అర్ధమైపోతోంది.

 

 తనపై కోర్టుల్లో ఉన్న కేసుల విచారణలు జరగకుండా స్టేలతో ఎందుకు అడ్డుకుంటున్నారు ? విచారణ జరిగితే ఏదో ఓ కేసులో శిక్ష పడక తప్పదన్న భయంతోనే కదా ? శిక్షకు భయపడి అసలు తనపైన ఉన్న కేసుల విచారణనే అడ్డుకుంటున్న చంద్రబాబు కూడా కేసులకు పార్టీలో ఎవరైనా భయపడేవారు ఉన్నారా ? అని అడగటమే విచిత్రంగా ఉంది.

 

చంద్రబాబుపై ఉన్న ఇతర కేసుల సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. దాదాపు అందరికీ తెలిసింది మాత్రం ఓటుకునోటు కేసే. ఈ కేసులో అడ్డంగా ఆడియో సాక్ష్యాధారాలతోనే కాకుండా లంచం డబ్బులిస్తు రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత కూడా చంద్రబాబు బుకాయించారు. మొత్తానికి తెరవెనుక కేసియార్ తో జరిగిన ఒప్పందం కారణంగా విచారణ ముందుకు సాగనీయకుండా ఉండటంలో భాగంగా హైదరాబాద్ ను వదిలేసి పారిపోయారన్న విషయం అందరికీ తెలిసిందే.

 

కేసంటేనే భయపడిపోయే చంద్రబాబు కూడా కేసుల గురించి, ధైర్యం గురించి మాట్లాడుతుంటే జనాలు నవ్వుకుంటున్నారు. పార్టీ మొత్తం మీద కేసులంటే భయపడే నేతలు ఎవరైనా ఉన్నారంటే ముందు చంద్రబాబు పేరే చెప్పుకోవాలి. పార్టీ నేతల ప్రకారమే అత్యంత పిరికిగా ఉండేదే చంద్రబాబు. ఎందుకంటే పార్టీలో క్రమశిక్షణ తప్పి వ్యవహరించినా ఒక్కరిపైన కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండానే కాలం గడిపేస్తున్నారు.

 

ఎన్టీయార్ విషయం గుర్తు చేసుకుంటే క్రమశిక్షణ తప్పిన నేతలను వెంటనే సస్పెండ్ చేయటమో లేకపోతే బహిష్కరించటమో జరిగిపోయేది. మరి చంద్రబాబు హయాంలో ఎంతమంది నేతలపై చర్యలు తీసుకున్నారు ?  ఇది చంద్రబాబు ధైర్యం సంగతి. ఈయన కూడా ధైర్యం గురించి మాట్లాడేస్తున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: