చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపార్టీ నేతల వ్యవహార శైలి అలాగే ఉంది చూస్తుంటే. మొన్నటి ఎన్నికల్లో తగిలిన ఘోరమైన దెబ్బ నుండి చంద్రబాబు అండ్ కో ఇంకా కోలేకపోతున్నారు. వీళ్ళ సంగతి ఇలాగుంటే వీళ్ళ పార్టనర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు కూడా ఇలాగే ఉంది లేండి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 151 మంది ఎంఎల్ఏల అఖండ మెజారిటితో గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించటానికి అనర్హుడు. కేవలం చావుతప్పి కొన్ను లొట్టపోయినట్లుగా 23 మంది ఎంఎల్ఏలను గెలిపించుకున్న చంద్రబాబు అర్జంటుగా సిఎం అయిపోవాలి.  ఏ ప్రభుత్వంలో అయినా మైనస్సులు, ప్లస్సులు ఉండటమన్నది చాలా సహజం.

 

అయితే మొన్నటి వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా మూనస్సులే కనిపించాయి. అవినీతి విశృంఖలంగా చెలరేగిపోయింది. అరాచకాలు ఆకాశమంతగా పెరిగిపోయింది. ఒక విధంగా చంద్రబాబు పాలనలో అరాచకమే రాజ్యమేలిందంటే అతిశయోక్తి కాదు. పోనీ పరిపాలన ఎలాగున్న 2014 ఎన్నికల్లో తానిచ్చిన హామీలన్నా పూర్తిగా నెరవేర్చారా అంటే అదీ లేదు.

 

ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోవటం, అవినీతి పెరిగిపోవటం పాలనలో అరాచకం పెరిగిపోవటంతో జనాలు విసిగిపోయారు. దాని ఫలితమే తెలుగుదేశంపార్టీకి వచ్చిన 23 సీట్లు. చంద్రబాబు దృష్టిలో తాను అద్భుతంగా పరిపాలించారు. రాజధాని అమరావతి కోసం రూ. 2 లక్షల కోట్ల సంపద సృష్టించినట్లు చెప్పుకుంటుంటారు.

 

మరి చంద్రబాబు చెప్పింది నిజమే అయితే 23 సీట్లే ఎందుకొచ్చాయి ? రాజధాని ప్రాంతం నియోజకవర్గాలైన మంగళగిరి, తాడికొండల్లో టిడిపి ఎందుకోడిపోయింది ? మంగళగిరిలో పోటి చేసింది భవిష్యత్ ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకున్న  చేసుకున్న నారావారి పుత్రరత్నం లోకేషే. చంద్రబాబు దృష్టిలో జగన్ సిఎంగా ఎంతమాత్రం పనికిరాడని టిడిపి తాజాగా రిలీజ్ చేసిన చార్జిషీటులోని అంశాలు చూస్తే చాలు అర్ధమైపోతుంది. జనాలు అఖండ మెజారిటి ఇచ్చిన తర్వాత కూడా బుద్ధి మారకపోతే వీళ్ళనేమనాలి ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: