జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయం మొత్తం చంద్రబాబునాయుడు రక్షణ కోసమే అనే ప్రచారం అందరికీ తెలిసిందే. చంద్రబాబు జేబులోని మనిషే పవన్ అని వైసిపి నేతలు కూడా ఎప్పటి నుండో ఆరోపిస్తున్నారు. తాను చంద్రబాబు చెప్పినట్లే నడుచుకుంటానని జరుగుతున్న ప్రచారం తప్పని పవన్ చెబుతున్నా ఎవరూ నమ్మటం లేదు.

 

పవన్ ఎంత చెబుతున్నా జనాలు ఎందుకు నమ్మటం లేదు ? ఎందుకంటే అందుకు తాజా ఘటనే ఉదాహరణగా నిలిచింది. రైల్వే కోడూరులో పర్యటించిన పవన్ బహిరంగ సభలో మాట్లాడుతూ ఓ ఘటన ఉదహరించారు. తాను రేణిగుంట విమానాశ్రయంలో దిగి రైల్వేకోడూరుకు వస్తుంటే ఓ మహిళ తనతో మాట్లాడిందట.

 

సదరు మహిళ తనతో మాట్లాడుతూ ఆడబిడ్డల సంరక్షణ కోసం పోరాటం చేయమని చెప్పిందట.  ఎందుకంటే  రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న తన కూతురిని 2017 రేప్ చేసి హత్య చేశారట. తన కూతురికి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని ఆమె కోరినపుడు తన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయని పవన్ చెప్పటం వరకు ఓకే.

 

అయితే ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలే విచిత్రంగా ఉంది. సదరు చెప్పిన మాటలను చెప్పిన వెంటనే పవన్ రెచ్చిపోయి నేరుగా జగన్మోహన్ రెడ్గికి అల్టిమేట్ ఇచ్చేశారు. ఈ కేసు విచారణ జరగనీయకుండా జగన్ ఎందుకు తొక్కిపెడుతున్నారంటూ నిలదీశారు. రేప్ చేసి హత్య చేసిన వాళ్ళను జగన్ ఎందుకు కాపాడుతున్నారు ? అంటూ ప్రశ్నించేశారు. రాజకీయ నేతలకు, పోలీసులకు ఆడ పిల్లలు లేరా ? అంటూ నిలదీయమే అందరినీ ఆశ్చర్యపరిచింది.

 

 ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఘటన జరిగింది 2017లో. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ? చంద్రబాబునాయుడే కదా ? కేసు విచారణను తొక్కిపెట్టింది చంద్రబాబే కదా ? చంద్రబాబు హయాంలో జరిగిన ఘటనకు ఆరుమాసాల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ బాధ్యత ఏముంటుంది ? అంటే ఇక్కడ మ్యాటర్ క్లియర్. చంద్రబాబు హయాంలో జరిగిన సకల దరిద్రాలకు జగన్ దే బాధ్యతగా పవన్ డిసైడ్ అయిపోయారు. అడగాల్సిన చంద్రబాబును వదిలేసి ఏ సంబంధం లేని జగన్ ప్రశ్నిస్తున్నారంటే చంద్రబాబు జేబులోని మనిషే పవన్ అనటానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం కావాలా ?

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: