పోలీస్ జాబ్ అంటే ప్రజలకు రక్షణ కల్పించడం... ప్రజలకు ఎలాంటి అపాయం కలిగినా వెంటనే వారిని సమస్యల నుంచి బయటపడేయటం . ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడి  తమ కర్తవ్యాన్ని నిర్వర్తించటం . అయితే కొంతమంది  పోలీసులు తమ కర్తవ్యం లో భాగంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎవరు చేయలేని సాహసాలను ధైర్యంగా చేస్తూ ఇతర పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ప్రజలకు వచ్చిన సమస్యలను తీర్చడంలో ప్రాణాలు సైతం లెక్క చేయరు కొంతమంది గ్రేట్ పోలీసులు. కొందరు పోలీసులు సామాన్య ప్రజలను అస్సలు పట్టించుకోరు... కొంతమంది మాత్రం తమ ప్రాణాలు పోతున్న కూడా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. 

 

 

 

 ఖాకి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ... అందరికీ రక్షణ కల్పించాలన్న తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ పౌరులకు భరోసానిస్తూ ఉంటారు. కర్తవ్య నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నలుగురికి ఆదర్శంగా ఉంటారు.ప్రాణాలు పోతున్న   తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రాణాలకు తెగిస్తు  ఉంటారు కొంతమంది ఆదర్శ పోలీసులు. ఇలాంటి కోవలోకే వస్తారు ఇప్పుడు మనం చెప్పుకునే పోలీస్ ఆఫీసర్. ఆపదలో ఉన్న మహిళను తన ప్రాణాలకు ముప్పు అని తెలిసిన  కూడా కాపాడాడు. నదిలో కొట్టుకు పోతున్న మహిళను... ఏ మాత్రం ఆలోచించకుండా నదిలోకి దూకి ఆ మహిళను కాపాడి ఒడ్డుకు చేర్చాడు. విజయవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా  ఈ పోలీస్  కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మహిళను  కాపాడి  అందరు పోలీసులకు ఆదర్శంగా నిలిచాడు. 

 

 

 

 వివరాల్లోకి వెళితే ఓ మహిళ ప్రమాదవశాత్తు బందరు కాలువ లో పడిపోయింది. అయితే కాలువలో నీటి ప్రవాహం ఉదృతి ఎక్కువగా ఉండడంతో ఆ మహిళ కొట్టుకుపోతుంది. అయితే తనను కాపాడాలంటూ ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ అర్జునరావు అది  గమనించాడు. దీంతో ఏమి ఆలోచించకుండా వెంటనే కాలువలోకి దూకేసాడు ఆ పోలీస్. ఈదుకుంటూ వెళ్లి ఆ మహిళని  ఒడ్డుకు చేర్చారు. అనంతరం ప్రథమ చికిత్స చేసి  ఆ మహిళ ప్రాణాలను కాపాడాడు. తన ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందని తెలిసినప్పటికీ అత్యంత ధైర్య సాహసాలతో కాలువలోకి దూకి మహిళలు కాపాడిన  ట్రాఫిక్ ఎస్ఐ అర్జునరావు పై స్థానికులు ప్రశంసలు కురిపించారు. అర్జున రావు  పేరును  ప్రధానమంత్రి లైవ్ సేవింగ్ మెడల్ నామినేట్ చేస్తున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: