రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పార్టీ జెండా రంగులు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆఫీసులకు వేస్తూ ఉండటం ప్రస్తుతం ట్రెండ్ గా మారిపోయింది. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అన్ని కార్యాలయాలు ఆఫీసులకు టిడిపి జెండా కలర్ పచ్చ రంగును వేయించింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక వైసిపి రంగులు అన్ని కార్యాలయాలకు వేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. రంగులు వేయడం లో ఉన్న శ్రద్ధ జగన్ కు పాలన  చేయడంతో లేదని  విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా వైసీపీ రంగుల వ్యవహారంపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. 

 

 

 

 రాయలసీమ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ పై  ధ్వజమెత్తారు. టిడిపి ప్రభుత్వం చేసే ప్రతి పనికి జగన్ ప్రభుత్వం వ్యతిరేకంగా వెళ్తున్నారని విమర్శలు గుప్పించారు. తిరుమల ఏడుకొండలకు తప్ప అన్నింటికీ  రంగులు వేశారు అంటూ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వైసిపి పార్టీది రంగుల రాజ్యం అంటూ పవన్ కల్యాణ్ విమర్శించారు . సీమ నుంచి ఎంతోమంది సీఎంలుగా పదవీ బాధ్యతలు చేపట్టారని అయినా ఇక్కడ వెనుకబాటుతనం తొలగిపోలేదు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాయలసీమలోని రైతులకు జగన్ ప్రభుత్వం  కోల్డ్ స్టోరేజీలు  తట్టుకోలేకపోయారు అంటూ విమర్శించారు. 

 

 

 

 తాను రాజకీయాల్లోకి వచ్చింది సిమెంట్ ఫ్యాక్టరీ లు  పెట్టుకునేందుకు కాదు అంటూ పరోక్షంగా సీఎం జగన్ ను ఉద్దేశించి పలు విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాను రాజకీయాల్లోకి వచ్చింది  ప్రజా సేవ చేయడానికి అన్నారు . రాయలసీమలో రాజకీయ నేతలకు పచ్చటి పొలాలు ఉన్నాయని కానీ ఇక్కడ పేదల పొట్ట చేతబట్టుకుని వలసల వెళ్తున్నారంటూ  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఓట్ల రాజకీయాలు చేయని రోజు రైతులను ఇబ్బంది పెట్టని  రోజు తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గౌరవిస్తా  అంటూ స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: