151...22...ఇది 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీల సంఖ్య, 175కి గానూ 151 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలకి 22 గెలిచారు. సరే ఈ నెంబరింగ్ గురించి కాసేపు పక్కనబెడితే.... జగన్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటుతుంది. ఈ ఆరు నెలల్లో జగన్ పాలన పట్ల జనం సంతృప్తిగానే ఉన్నారు. కాకపోతే అక్కడక్కడ కొన్ని లోటు పాట్లు ఉండటం వల్ల కొందరు అసంతృప్తిగాన ఉన్నారు. అయితే జనమే ఇలా ఉంటే ఇంకా వైసీపీ కేడర్ ఏ రేంజ్ లో సంతృప్తిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జగన్ ఆరు నెలల పాలన పట్ల వైసీపీ కేడర్ ఫుల్ హ్యాపీగా ఉంది.

 

అయితే ఇంత హ్యాపీగా ఉన్న వైసీపీ కేడర్ కు ఒక్క విషయంలో కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. అది కూడా ఎంపీల విషయంలోనే. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. అయితే వీరు ఈ ఆరు నెలల్లో ఏం చేశారనేది ఎవరికి పెద్దగా కనబడలేదు. పోనీ రాష్ట్రంలో కనపడకపోయిన లోక్ సభలోనైనా హైలైట్ అయ్యారంటే అది లేదు. పైగా ఈ ఆరు నెలల్లో వీరు రాష్ట్రానికి ఉపయోగపడే  పనులు కూడా చేయించలేదు. ఇక మొన్నటివరకు ప్రత్యేక హోదానే జీవితమని చెప్పిన వైసీపీ...ఇప్పుడు దానిపై ఆశలు వదిలేసుకుంది.

 

కేంద్రంలో బీజేపీకి బంపర్ మెజారిటీ ఉండటంతో జగన్ ముందే దీనిపై క్లారీటీ ఇచ్చేశారు. వారిని మనం బ్రతిమలాడటం తప్ప ఏం చేయలేములే అని. సరే పోరాటం కుదరదు...పోనీ ఈ ఆరు నెలల్లో ఎంపీలు బ్రతిమలాడిన సందర్భాలు కూడా ఏం లేవు.  అయితే ఈ 22 మంది ఎంపీల కంటే టీడీపీ ముగ్గురు ఎంపీలు లోక్ సభ లో దుమ్ముదులిపారనే చెప్పొచ్చు. రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నానిలు రాష్ట్ర సమస్యలపై లోక్ సభలో ఏదో రూపంలో ప్రస్తావిస్తూనే ఉన్నారు.

 

ఇక మాట్లాడే విధానంలో కూడా వీరు దూకుడుగా ఉన్నారు. వీరితో పోలిస్తే వైసీపీ ఎంపీలు మాట్లాడటంలో సుద్దపప్పుల్లాగానే అనిపిస్తున్నారు. అలాగే కేంద్రం తీసుకొచ్చే బిల్లులపై కూడా వీరు అనర్గళంగా మాట్లాడుతూ....తప్పొప్పులని ఎత్తి చూపిస్తున్నారు. అందుకే తమ పార్టీలో వీరు ఉంటే బాగుండేదని వైసీపీ కేడర్ కూడా అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. కనీసం రామ్మోహన్ నాయుడులాంటి వారు ఉన్న బాగుండేదని అనుకుంటున్నారు. ఏదేమైనా ఎంపీల విషయంలో మాత్రం వైసీపీ కేడర్ కొంచెం అసంతృప్తిగానే ఉన్నట్లు కనబడుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: