సాధారణంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒకే మాట పదే పదే మాట్లాడటం అలవాటు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కూడా బాబు పదే పదే ఒక విషయాన్ని చెబుతూ వస్తున్నారు. కాకపోతే అది ప్రజల మేలు కోసం కాదు. తమ పార్టీ కాంట్రాక్టర్ల కోసం. ఇంతకి ఆయన చెబుతున్న విషయం ఏమిటంటే? గత టీడీపీ ప్రభుత్వంలో నీరు-చెట్టు, నరేగా పనులుతో పాటు పలు కాంట్రాక్ట్ పనులు చేసిన టీడీపీ నేతలకు రావాల్సిన నిధులు గురించి.

 

ఇటీవల కాలంలో ఆయన ఏ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగిన ప్రతిసారి ఈ విషయం గురించి ప్రస్తావన తీసుకురాకుండా ఉండటం లేదు. తాజాగా కర్నూలులో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కూడా దీని గురించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో పనులు చేసిన మనవాళ్ళకు డబ్బులు రావాల్సి ఉందని, నరేగా పనులకు కేంద్రం నుంచి నిధులు వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని వేరే కార్యక్రమానికి ఉపయోగించారని మాట్లాడారు.

 

అయితే ఇదే విషయం బాబు ఓడిపోయిన దగ్గర నుంచి చెబుతూనే ఉన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం దీనిపై ఏం మాట్లాడటం లేదు. ఎందుకంటే గత టీడీపీ ప్రభుత్వంలో నీరు-చెట్టు, పలు కాంట్రాక్ట్ పనుల్లో అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపిస్తుంది. అలాగే ఈ విషయం ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రస్తావించారు. కాబట్టి అవినీతి తేల్చేవరకు దీనిపై వైసీపీ ఏం చెప్పకపోవచ్చు. అటు బాబు చేసిన అప్పుల వాళ్ళలో ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో తెలిసిందే.

 

ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం నరేగా నిధులని వేరే కార్యక్రమాలకు ఉపయోగించి ఉంటారు. అసలు బాబు అయితే ఆర్ధిక క్రమశిక్షణ లేకుండా ఏ నిధులని ఎలా వాడేశారో కూడా తెలియదు. అప్పుడు ఆవిధంగా తప్పులు మీద తప్పులు చేసిన బాబు...ఇప్పుడు తమ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇప్పించుకునేలా చేసుకోవడానికి విఫలయత్నాలు చేస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: