కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ దారుణంగా దెబ్బ తినడానికి ప్రధాన కారణం ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమానే కారణం అని ఆ పార్టీ కార్యకర్తలే అంటూ ఉంటారు. ఆయన అన్ని నియోజకవర్గాల్లో తన పెత్తనం చేలాయించాలని చూడటం, తన కంటే ఎవరైనా ధీటుగా ఎదుగుతున్నారు అని భావిస్తే వాళ్ళను ఇబ్బందులు పెట్టడం వంటివి ఉమా చాన్నాళ్ళు గా చేస్తూ వచ్చారు. చివరకు విజయవాడ ఎంపీ కేశినేని నానిని కూడా ఉమా ఇబ్బందులు పెట్టాలని చూడటం పార్టీని చీకాకు పెట్టింది. అందుకే నాని ఉమాను టార్గెట్ చేసే క్ర‌మంలోనే పార్టీ అధిష్టానానికి శ‌త్రువు అయ్యాడు.

 

తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది... ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా వేలు పెట్టినట్టు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేల సన్నిహితులకు సీట్లు ఇవ్వాలని ఉమా భావిస్తున్నారట. దెందులూరు నియోజకవర్గంలో చింతమనేనితో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆ నియోజకవర్గంలో వేలు పెట్టి ఆయనకు సహకరిస్తున్నారట ఉమా.. ఏలూరు నియోజకవర్గంలో కూడా ఆయన వేలు పెట్టినట్టు సమాచారం.

 

చింతమనేనికి, బడేటి బుజ్జికి అంతంత మాత్రంగానే సంబంధాలు ఉన్నాయి. దీంతో ఏలూరు నియోజక్వర్గంలో ఉమా తన పలుకుబడితో స్థానిక సంస్థల ఎన్నికల్లో త‌న వారికి సీట్లు ఇప్పించాలని భావిస్తున్నారట. ఈ విషయాన్నీ బడేటి బుజ్జి... చంద్రబాబు వద్దకు కూడా తీసుకువెళ్ళారని సమాచారం. ఇక మాగంటి బాబు వర్గం కూడా ఉమా పెత్తనం మీద ఆగ్రహంగా ఉంది.

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వారికి పెత్తనం ఇవ్వాలని ఆయన అనుకోవడం ఏంటి అని మాగంటి బాబు... పార్టీ ముఖ్యుల దగ్గర అసహనం వ్యక్తం చేశారట. ఇప్పటికే కృష్ణా జిల్లా ఉమా కారణంగా ఇబ్బంది పడుతోంది. ఇప్పుడు ప‌శ్చిమ గోదావ‌రి జ‌ల్లాలో కూడా ఉమా పెత్తనం అక్క‌డ పార్టీ నేత‌ల‌కు చికాకుగా మారింది. ఏదేమైనా పార్టీ ఇన్ని క‌ష్టాల్లో ఉన్నా కూడా ఉమా మాత్రం త‌న తీరు మార్చుకోవ‌డం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: