మహారాష్ట్రలో ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య శివసేన - కాంగ్రెస్ - ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పడింది. అయితే వీరి కంటే ముందే ఫడ్నవిస్ మూడు రోజులు మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు. అయితే ఉద్ధవ్ థాక్రే సీఎంగా ప్రమాణస్వీకారం చేయడంతో నెలరోజులకు పైగా సాగిన మహా హైడ్రామాకు తెరపడింది. రాజకీయ సంక్షభం ముగియడంతో  ఇప్పుడిప్పుడే ప్రజాపాలన వైపు అందరూ చూస్తున్న తరుణంలో బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్ హెడ్గే సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈయన చేసిన సంచలన వ్యాఖ్యలు ..మాజీ సీఎం ఫడ్నవిస్ ని ఇబ్బందుల్లోకి నెట్టింది.  వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ గా చెప్పే ఈయన తాజాగా మాజీ సీఎం ఫడ్నవిస్ పై  చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 

సోషల్ మీడియాలో దీని గురించి తెగ చర్చ నడుస్తుంది. అసలు అప్పటివరకు బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఇష్టం లేదు అని ప్రచారం జరిగింది. కానీ తెల్లవారితే మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని భావించి.. సంఖ్యాబలం లేకుండానే బీజేపీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత మళ్లీ విశ్వాస పరీక్షకు కావాల్సిన సంఖ్యాబలం లేకపోవడంతో సీఎం పదవికి ఫడ్నవిస్ రాజీనామా చేసారు. దీనితో సంఖ్యా బలం లేకున్నా ఏర్పాటుకు ఎందకు ముందడుగు వేసిందని అంతా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో అనంత్ కుమార్ హెడ్గే సమాధానం ఇచ్చారు.



అనంత్అ కుమార్ ఎవరికీ తెలియని ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పారు. భివృద్ధి పనుల కోసం కేటాయించిన కేంద్రం నిధుల నుంచి రూ.40వేల కోట్లు వినియోగించుకునేందుకు సీఎంకు అధికారం ఉంటుందని చెప్పిన హెడ్గే.. కాంగ్రెస్ - ఎన్సీపీ - శివసేనలు ప్రభుత్వంలోకి వస్తే అభివృద్ధి పేరుతో ఆ నిధులను దుర్వినియోగం చేస్తాయని దేవేంద్ర ఫడ్నవీస్ ముందే గ్రహించారని చెప్పారు. ఈ క్రమంలోనే ఈ నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకే డ్రామా ఆడారని వెల్లడించారు అనంత్ హెడ్గే. 15 గంటల్లోనే సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారని వెంటనే ఆ రూ.40వేల కోట్ల నిధులను తిరిగి కేంద్రంకు పంపించారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: