ఇటీవల కాలంలో చంద్రబాబు శ్రీరంగనీతులు బాగా చెబుతున్నట్లు అనిపిస్తోంది. ఓడిపోయాక కూడా తమ గత ఐదేళ్లు పాలనపై ఆత్మవిమర్శ చేసుకోకుండా...ఇప్పుడు జగన్ పాలనపై విమర్శలు చేస్తుంటే బాగా కామెడీగా అనిపిస్తుంది. తాను దారుణమైన పాలన అందించడం వల్లే ప్రజలు ఓడించారనే విషయం మరిచిపోయి ఇప్పుడు నీతి వాక్యాలు చెబుతున్నారు. జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగానే ఉన్న బాబు మాత్రం ఏదో కొంపలు మునిగిపోయినట్లు మాట్లాడేస్తున్నారు.

 

అసలు ప్రజలు అనుకోకపోయిన బాబు మాత్రం జగన్ పాలన కంటే తమదే బాగుందని చెప్పేసుకుంటున్నారు. పైగా జగన్ని సీఎం చేసి ప్రజలు తెగ కష్టాలు పడిపోతున్నట్లు మాట్లాడేస్తున్నారు. గత ఆరు నెలలుగా బాబు ఇవే సూక్తులు చెబుతూ వచ్చారు. తాజాగా కూడా కర్నూలు పర్యటనలో ఉన్న బాబు కొన్ని కామెడీ మాటలు మాట్లాడారు. తమ ప్రభుత్వం హయాంలో వైసీపీ వాళ్ల మీద కేసులు పెడితే అసలు ఆ పార్టీ ఉండేదా? అని అన్నారు.

 

అంటే గత టీడీపీ ప్రభుత్వం హయాంలో వైసీపీ నేతలని, కార్యకర్తలని బాబు అండ్ బ్యాచ్ ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని అన్నట్లు మాట్లాడారు. కానీ వైసీపీని ఐదేళ్లు ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారో ప్రతిఒక్కరికి తెలుసు. ప్రత్యేక హోదాపై పోరాటానికి వెలుతున్న జగన్ ని విశాఖ ఎయిర్ పోర్టులో ఏ విధంగా అడ్డుకున్నారో తెలుసు. కోడికత్తి దాడి జరగాక ఏ విధంగా ఎగతాళిగా మాట్లాడారో తెలుసు. రోజాని అసెంబ్లీకి రాకుండా ఏ విధంగా ఆపారో తెలుసు.

 

అలాగే జన్మభూమి కమిటీలు వైసీపీ కార్యకర్తలకు పథకాలు అందకుండా ఏ విధంగా చేశారో తెలుసు. 23 మంది ఎమ్మెల్యేలని ఎలా లాక్కున్నారో తెలుసు. ఇక చింతమనేని ప్రభాకర్, యరపతినేని శ్రీనివాసరావు, కోడెల ఫ్యామిలీ, మంత్రుల ఫ్యామిలీలు అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఏం చేశారో కూడా తెలుసు. ఈ విషయాలన్నీ మరిచిపోయి చంద్రబాబు ఇప్పుడు అసలు వైసీపీని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయనట్లు గురివింద కథలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: