నిరుద్యోగులకు ప్రతి రోజు ఏదొక విధంగా ఎక్కడొక చోట ఉద్యోగ నోటిఫికేషన్లు పడుతూనే ఉన్నాయి. ఒకసారి కేంద్రం నుండి నోటిఫికేషన్ విడుదల అవుతే మరోసారి రాష్ట్రం నుండి నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఇలా ఎక్కడ పడితే అక్కడ నోటిఫికేషన్ విడుదల అయ్యి నిరుద్యోగులకు తీపి కబురు అందుతుంది. 

 

అయితే ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగుల కోసం ఆంధ్ర యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలలోనే నాలుగు లక్షలమందికి ఉద్యోగాలు కల్పించి రికార్డు సృష్టించగా ఇప్పుడు తెలంగాణ సర్కార్ వంతు వచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఎలక్ర్టానిక్స్ మానిఫ్యాక్చరింగ్ రంగంలో వచ్చే నాలుగేళ్లలో 3 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు సిద్దమైనట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ వెల్లడించారు.    

 

ఈ తరహాలోనే ఈరోజు హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఇంటెల్‌ డిజైన్ అండ్ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతోందని ఇంటెల్ సంస్థ 'ఎక్సెస్‌ స్కేల్‌ కంప్యూటర్' అభివృద్ధి పరచడం మనకు గర్వకారణమని చెప్పారు.     

 

కాగా కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో 1500 మంది ఉద్యోగులు పనిచేసేలా ఏర్పాట్లు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. బెంగళూరుకు ధీటుగా హైదరాబాద్ దూసుకువెళ్తుందని అందులో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, ఎలక్ట్రానిక్స్, యానిమేషన్, గేమింగ్, ఆఫీస్ స్పేస్ రంగాల్లో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన చెప్పారు.

 

ఈ నేపథ్యంలోనే వచ్చే నాలుగేళ్లలో 3 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని ఇంటెల్ సంస్దను బెంగుళూరు తర్వాత హైదరాబాద్ లో రెండో కేంద్రంగా ప్రారంభించడం ఎంతో గొప్ప విషయమని అయన చెప్పారు. కాగా ఈ విషయాలన్నింటిని ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: