సాంకేతికత ఎంత పెరుగుతుందో.. నేరాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. మరోవైపు ప్రాణాలు అరచేతిలో ఉంచుకుని  గుమ్మం దాటిన ఆడపడుచు తిరిగి ఇంటికి చేరే వరకు భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి దుస్థితి పట్టింది .  ప్రమాదాలపై ఎక్కువ మందికి అవగాహన లేక.. విపత్కర పరిస్థితుల్లో ఏమి చేయలో తెలియలేక తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. దీనిపై  విజయవాడ నగర పోలీసు శాఖ ప్రత్యేక చర్యలను ప్రారంభించింది. ప్రజలకు  ప్రమాదాలు , వాటిపై తీసుకోవాల్సిన  జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రణాళిక చేసింది. దీనిలో భాగంగా  ఓ యాప్‌ను  “బీ సేఫ్‌’ పేరిట  రూపొందించింది.  యాప్‌లో ఆడియో, వీడియోలను పొందుపరిచింది.

 

 రాజధాని ప్రాంతంలో నగరం భాగమవడంతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మాల్స్‌ సంస్కృతి పెరిగింది. పాశ్చాత్య పోకడలు పెరిగాయి.ఒక పోలీసు స్టేషన్‌లో నగరంలో నిత్యం ఏదో  మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు, అత్యాచారం వంటి ఘటనలపై కేసులు నమోదవుతున్నాయి.నగర పోలీసు కమిషనరేట్‌ ఆధ్వర్యంలో వీటిని నివారించేందుకు ఒక  ప్రత్యేక నంబర్లు ఉన్నా అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శక్తి బృందాలు, డయల్‌ 100, ఇంటర్‌సెప్టార్, వాట్సాప్‌ లాంటి సౌకర్యాలు ఉన్నా.. చిక్కులు తప్పడం లేదు.

 

ఈ నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు “బీసేఫ్‌’ అనే ప్రత్యేక యాప్‌ను  మహిళా భద్రతలపై చర్యలు చేపట్టడానికి  రూపొందించారు. . ఈ యాప్‌ ద్వారా డయల్‌ 100, గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్, ఓటీపీ, ఫేస్‌బుక్‌ మోసాలతోపాటు సురక్షిత ప్రయాణం, దొంగల బారిన పడకుండా తీసుకోవాల్సిన రక్షణ చర్యలు వంటి అంశాలపై ఆడియో, వీడియో రూపంలో అవగాహన కల్పిస్తారు.


సెల్‌ఫోన్‌లో బీసేఫ్‌ యాప్‌ను  డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు.. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాచారం మొత్తం మీ ముందు దృశ్యశ్రవణ రూపంలో కనిపిస్తుంది. ఏదైనా సంఘటన చూసినా.. వారి కళ్లముందు ప్రమాదం జరిగినా, అమ్మాయిలను ఎవరైనా ఈవ్‌ టీజింగ్‌ చేస్తున్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ యాప్ సంపూర్ణ అవగాహన కల్పించే విధంగా  రూపకల్పన చేశారు. ఈ యాప్‌ పోస్టర్లను నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లతోపాటు పాఠశాలలు, కళాశాలలు, వీధుల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఫోన్‌లో గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి లేదా.. ఆయా పోస్టర్‌ల మీద ఉండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసుకుని యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: