ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పీఠాన్ని అందిష్టించి ఆరు నెలలు ఇటీవల గడవడంతో పలువురు రాజకీయ విశ్లేషకులతో పాటు పలు పార్టీల నాయకులు కూడా ఆయన ఆరు నెలల పాలన పై ఎవరికి వారు తమ అభిప్రాయాన్ని తెల్పడం జరిగింది. అందులో భాగం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ పాలన పై అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. ఈ ఆరు నెలల పాలనలో జగన్ రెడ్డి గారి వలన రాష్ట్రానికి పూర్తిగా నష్టం చేకూరింది తప్పితే, ఏ మాత్రం లాభం లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కొందరు సుముఖత వ్యక్తం చేయగా, మరికొందరు విమర్శలు ఎక్కుపెట్టారు. 

 

పవన్ కళ్యాణ్ గారు టిడిపి పార్టీతో రహస్య ఎజెండా పెట్టుకుని జగన్ గారి పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించివారు కూడా ఉన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా, ఆయనను జగన్ రెడ్డి గారు అని సంబోధించడం గమించవచ్చు. జగన్ గారిది ఫలానా రెడ్డి కులం అని ప్రత్యేకంగా తెలిసేలా పవన్ కళ్యాణ్ పిలుస్తుడడంతో, వైసిపి నాయకులు సహా మరికొందరు కూడా పవన్ కళ్యాణ్ ను పవన్ నాయుడు అంటూ పిలవడం మొదలెట్టారు. అయితే తాను జగన్ గారిని జగన్ రెడ్డి అని పిలుస్తుండడంతో, కావాలనే తనను వైసీపీ నాయకులు టార్గెట్ చేసి పవన్ నాయుడు అని సంబోధిస్తున్నారని, 

 

కానీ నిజానికి తన పేరు పవన్ కళ్యాణ్ కాదని కళ్యాణ్ కుమార్ అని పవన్ నిన్న ఒక సభలో మాట్లాడుతూ చెప్పారు. అయితే తనను పవన్ నాయుడు అని పిలిచినందు వల్ల తనకు అభ్యంతరం లేదని, ఎందుకంటే తన తండ్రి తనకు పేరు చివర కులం పేరుని చేర్చలేదని తాను గర్వంగా చెప్పుకుంటానని పవన్ చెప్పుకొచ్చారు. కాగా ఈ వార్తపై కొందరు విరుచుకుపడుతూ, పవన్ గారు కులం గురించి పైకి మాట్లాడకపోవచ్చు, కానీ లోలోపల మాత్రం వారి సామజిక వర్గానికే పెద్ద పీట వేసిన ఘటనలు అనేకం ఉన్నాయని విమర్శిస్తున్నారు. అయితే ఇందులో ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో అనే విషయం అటుంచితే, ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు రాజకీయ వర్గాల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!!     

మరింత సమాచారం తెలుసుకోండి: