నూతన మద్యం విధానాన్నీ  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చారు ఈ విధానం సత్ఫలితాలిస్తోంది.  ఆంధ్రప్రదేశ్ ఈ  మద్య నియంత్రణ, నిషేధం దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. ఇందుకు నిదర్శనంగా ఏపీలో మద్యం వినియోగం, విక్రయాలు గణనీయంగా తగ్గాయి. 29లక్షల 62వేలు 2018 నవంబర్‌లో కేసులు  లిక్కర్‌ను విక్రయించగా.. ఈ ఏడాది నవంబర్‌లో  కేవలం 22లక్షల 31వేల కేసుల మద్యం మాత్రమే అమ్ముడయింది.  24.67 శాతం మేర మద్యం అమ్మకాలు తగ్గినట్టయింది.ఇక 2018 నవంబర్‌లో పోలిస్తే  బీర్ల అమ్మకాల విషయానికి వస్తే 17లక్షల 80వేల కేసులు అమ్ముడుపోగా, ఈ ఏడాది నవంబర్‌లో 8లక్షల 13వేల కేసులను మాత్రమే విక్రయించారు. 

 

దీంతో  54.30 శాతంగా బీర్ల అమ్మకాల్లో తగ్గుదల నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ వల్ల గతంలో ఉన్న 4380 మద్యం షాపులను 3500లకు తగ్గించారు.  అంతేకాకుండా  ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం అమ్మకం సమయాన్ని పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఈ మార్పు మద్యం ధరల పెంపుదల, అమ్మకాల్లో నియంత్రణ విధిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయంతో  సాధ్యమైంది.

 

దీనిపై అధికారులు కొత్త మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో అమ్మకాలు తగ్గాయని, ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేకపోవడం, సమయాన్ని సక్రమంగా పాటించడంతో మద్యం క్రమక్రమంగా నియంత్రణలోకి వస్తోందని  చెబుతున్నారు. పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేయడంతో  మద్యం షాపులు కేవలం అమ్మకానికి పరమితమవుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఎక్సైజ్‌, పోలీసు అధికారులు సమన్వయంతో బెల్ట్‌ షాపులను తొలగించడంతో  మద్యం వినియోగం పూర్తిగా తగ్గిందని అధికారులు వివరించారు. 

 

దీనిపై గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా నిఘా ఉంచడం ద్వారా అక్రమ మద్యం విక్రయాలకు అవకాశం లేకుండా పోయిందన్నారు. అధికారులు  నూతన మద్యం విధానం వల్ల ఆదాయం మాత్రం తగ్గలేదని  తెలిపారు. భారీగా రెట్లు పెంచడంతో.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అలాగే ఉందన్నారు. మద్యం వినియోగం మాత్రం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: