సిగరెట్ తాగే అలవాటు మీకు ఉందా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్.. బ్యాడ్ న్యూస్ కూడా.. ఏంటంటే.. సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారు ఆ అలవాటును మానేస్తే సంవత్సరంలో వారం రోజులు ఎక్కువగా సెలవలు ఇస్తాము అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అయితే ఇన్నాళ్లు స్మోక్ చేసే వారికీ జరిమానా విధించగా ఇప్పుడు ఆ జరిమానా బదులు మనిపించడానికి ఈ ఆఫర్ ప్రకటించింది ఓ కంపెనీ.                   

          

ఇంకా వివరాల్లోకి వెళ్తే.. టోక్యోకి చెందిన 'పియాలా ఐఎన్‌సీ' అనే మార్కెటింగ్ కంపెనీ ఈ బంపర్ ఆఫర్‌ను తన ఉద్యోగుల ముందు తీసుకొచ్చింది. అయితే, ఇందుకు బలమైన కారణం ఏంటంటే.. ఈ సంస్థ కార్యాలయం 29వ అంతస్థులో ఉంది. ఈ భవనం లోపల స్మోకింగ్ చేయడానికి ఎవరికీ అనుమతి లేదు, దీంతో ఉద్యోగులంతా కిందకు వెళ్లి సిగరెట్ తాగుతున్నారు. 

        

దీనిపై ఓ ఉద్యోగి తమ కంపెనీ యజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ''ఉద్యోగులు కిందికి వెళ్లి సిగరెట్ తాగిరావడానికి సుమారు 15 నుంచి 20 నిమిషాల సమయం అవుతుంది. దీని వల్ల ఎంతో విలువైన సమయం వృథా అవ్వడంతో పాటు ఇలా సిగరెట్ తాగేందుకు వెళ్లేవారి వల్ల సిగరెట్ తాగని ఉద్యోగులపై పనిభారం పడుతోంది’’ అని ఆ ఉద్యోగి ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

           

ఈ ఫిర్యాదు చూసిన సీఈవో అలాంటి ఉద్యోగులపై జరిమానా విధించేందుకు బదులు, ఏదైనా ప్రోత్సాహకాల ద్వారా అలవాటు మాన్పించాలని భావించారు. ఈ నేపథ్యంలోనే స్మోకింగ్ చేయడం మానేస్తే వారం రోజులు ఎక్కువగా సెలవలు ఇస్తాం అని ఆఫర్ ఇచ్చారు.. మరి ఈ ఆఫర్ ని ఎంతమంది ఉపయోగించుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: