విభజన ఆంధ్ర ప్రదేశ్ కు రావాల్సిన అన్ని రకాలైన పరిశ్రమలు మెల్లగా సమకూరున్నాయి. కడపలో స్టీల్ ప్లాంట్ ని ఏర్పాటు చేసేందుకు వైసీపీ సర్కార్ రెడీ అవుతోంది. దీనికోసం పూర్వ రంగం కూడా సిధ్ధం చేశారు. ఇదే నెలలో కడపలో పెద్ద ఎత్తున స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది.

 

దీనికి సంబంధించి పార్లమెంట్ లో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్ సానుకూలత వ్యక్తం చేశారు. కడపలో స్టీల్ ప్లంట్ ఏర్పాటుకు అన్ని విధాలుగా తాము సహకరిస్తామని కేంద్ర మంత్రి బదులివ్వడం వైసీపీకి ఊరట ఇచ్చే విషయంగానే చెపాలి. 

 

ఇక బాలశౌరి ఇదే అంశంపైన మట్లాడుతూ కడపలో స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ముడు సరుకు కోసం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. కడపలో ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ కి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే దివంగత వైఎస్సార్ పేరు మీద కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అయితే మాత్రం ఆయనకు శాశ్వత కీర్తి లభించడం ఖాయమేనని అంటున్నారు. వైఎస్సార్ పేరు మీద కడప జిల్లా ఉంది. ఇపుడు అదనంగా ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఆయన పేరిట నెలకొల్పడం ద్వారా ఆయన్ని నిరంతరం తలచుకునేలా చేసేందుకు వైసీపీ సర్కార్ క్రుషి చేస్తోందని అంటున్నారు.

 

టీడీపీ అయిదేళ్ళ పాలనలో కడపలో స్టీల్ ప్లాంట్ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని, వైసీపీ వచ్చిన ఆరు నెలల వ్యవధిలోపే కడప ప్లాంట్ కి ఒక రూపు రావడం అంటే ముఖ్యమంత్రిగా జగన్ పట్టుదల అని అంటున్నారు.  వరసగా హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న జగన్ ఇపుడు రాయలసీమలో శాశ్వత అభివ్రుధ్ధికి బాటలు వేసేలా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అడుగులు  వేయడాన్ని సీమ వాసులు సైతం స్వాగతిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: