పోయిన బుధవారం రాత్రి హైదరాబాదు మహా నగరంలోని శంషాబాద్ ప్రాంతంలో వెటర్నరీ డాక్టర్ దిశ (పేరు మార్చబడింది) ను అతి కిరాతకంగా మానభంగం చేసి, చంపేసి ఆఖరికి ఆమె కుటుంబసభ్యులకు చివరి చూపు కూడా దక్కనివ్వకుండా అతి ఘోరంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితులకు వెంటనే ఉరిశిక్ష విధించాలని దేశం నలుమూలల నుండి ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని మరియు న్యాయస్థానాన్ని నిలదీస్తున్నారు. ఇటువంటి మానవ మృగాలకు ఈ భూమిమీద బ్రతికే అర్హత లేదని ప్రజలు అంతా ఒకట్తై చెబుతున్న సమయంలో చర్లపల్లి జైల్ లో జరుగుతున్న సీన్ మాత్రం వేరేలా ఉంది.

 


నిన్న ఆదివారం కనుక నిందితులు నలుగురికి జైల్లో మటన్ బిర్యానీ పెట్టిన విషయాన్ని పోలీసు వారు వెల్లడించారు. దానికే ప్రజలంతా అగ్గిమీదగుగ్గిలం అవుతుంటే ఇప్పుడు కొత్తగా మరొక విషయం బయటికి వచ్చింది. అతి ఘోరమైన పని చేసి పట్టుబడిన ఆ నలుగురు నిందితులకు కాపలాగా దాదాపు 15 మంది పోలీసు వారు వారి చుట్టూ ఉండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏదో ఒక మంత్రికో లేక ప్రధానమంత్రికి ఉన్నట్లు అంతమంది అది కూడా జైల్లో వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఏమిటంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

 

 

ఇంతకీ ఇందుకు గల కారణం ఏమిటంటే పోలీసు మరియు మెజిస్ట్రేట్ వారు ఎక్కడ ఆ నలుగురు నిందితులు ఆత్మహత్య చేసుకుంటారో అని అటువంటి చర్యలు ఏమీ వారు తీసుకోకుండా ఉండేందుకు వీరు పోలీసు వారిని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండేందుకు అక్కడ నియమించారట. ఏదైనా ఒక తప్పు జరిగి వారి నలుగురు మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటే చివరికి అది తిరిగి తిరిగి వారి మీదకే వస్తుందని వారి ఆందోళన. ఈ విషయం తెలిసిన తరువాత కూడా ప్రజలు మీరు ఎలాగూ వారికి అతి తొందరలో ఉరిశిక్ష వేయరు కానీ వారికి వాళ్లే తమ పాపం తెలుసుకొని ప్రాణాలు తీసుకుంటే మీరు అడ్డుపడుతున్నారు ఎందుకు అంటూ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ పోలీసు మరియు కోర్టు వారికంటూ కొన్ని నిబంధనలు ఉంటాయి కాబట్టి వీళ్ళందరికీ విఐపి ట్రీట్మెంట్ శిక్ష పడేవరకు తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: