ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై మరోసారి రెచ్చిపోయారు మంత్రి కొడాలి నాని. ఒక ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య మీకు కోపం పెరిగిపోతుంది, టీడీపీ అంటే మీకు ఎందుకు అంతా కోపం అని అడుగగా నాని స్పందిస్తూ "చంద్రబాబు ఒక 420 నిత్యం అబద్దాలు మాట్లాడుతూ, మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డిపై అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు" అని చెప్పారు.

 

చంద్రబాబు ఎన్టీఆర్ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు అని నాని తెలుపగా, మరి అలాంటి టీడీపీ పార్టీలో మీరు ఎమ్మెల్యేగా పనిచేసారుగా అని ప్రశ్నించగా "ఆ పార్టీలో చేరి మేము సన్నాసులం అయ్యాం మా గురువు చంద్రబాబు మా కన్నా పెద్ద సన్నాసి, ఎధవ. మేము టీడీపీలో నుంచి బయటకి వచ్చి వైసీపీలో ఒక మూలన పడి ఉంటున్నాం. ఆ సన్నాసిలా పార్టీకి నాయకత్వం వహించట్లేదు" అని చెప్పారు.

 

ఇక వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతూ "వంశీ ని టీడీపీ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేశారు. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో వంశీ ని వాళ్ళ పక్కన కూర్చోవద్దు అంటే, స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లి మా పక్కన కూర్చోపెట్టుకోవడానికి మాకు అభ్యంతరం లేదు" అని పేర్కొన్నారు. వంగవీటి రాధా మళ్ళీ వైసీపీ పార్టీ లో చేరుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి దీనిపై మీరు ఏమంటారు అని అడుగగా "రాధా వస్తాను అంటే మేము జగన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడి పార్టీలో చేర్చుకునే విధంగా మాట్లాడతాం" అని చెప్పారు.

 

ఇక కొడాలి నాని అసలు ఫోన్ లోనే అందుబాటులో వుండరు, సొంత పార్టీ నేతల ఫోన్ చేస్తేనే స్పందించరు అలాంటిది సామాన్య ప్రజలకు అస్సలు అందుబాటులో ఉండరు అని ప్రతిపక్షాలు అంటున్నాయి దీనిపై ఏమంటారు అని అడుగగా "నేను టీడీపీ లో గెలిచినప్పుడు ప్రజలకు అందుబాటులో వున్నా, కానీ వైసీపీలోకి వెళ్లిన దగ్గర నుంచి అందుబాటులో లేనా" అని ప్రశ్నించారు. నా గురించి నా నియోజకవర్గం ప్రజల్ని అడగండి వాళ్లే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తారు అని నాని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: