ఏపీ మంత్రి కొడాలి నాని తన దూకుడు స్వభావంతో ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ప్రతిపక్ష టీడీపీ పార్టీ నేతలు నానిని బూతుల మంత్రిగా పిలుస్తుంటే, నాని మాత్రం టీడీపీ నేతలు చేసే 420 పనులకు బూతులు రాకుండా ఇంకేం వస్తాయి అని కౌంటర్ ఇచ్చారు.

 

తాజాగా మంత్రి కొడాలి నాని మరోమారు వార్తల్లో నిలిచారు. నాని ఒక ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ మాజీ మంత్రి మరియు టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత దేవినేని ఉమా కు మీకు మధ్య ఏం జరిగింది. మీరు, వల్లభనేని వంశీ దేవినేని ఉమాను ఎందుకు టార్గెట్ చేశారు అని నానిని అడుగగా "వాడొక వేస్టుగాడు, వాడి గురించి మాట్లాడుకోవడం వేస్ట్, ఒక మనిషిగా పుట్టాల్సినోడు కాదు వాడు, పదవి కోసం వదినను చంపాడు, అన్న ఆక్సిడెంట్లో చనిపోతే వదినను పదవి కోసం చంపాడు అలాంటి వాడి కోసం మనం మాట్లాడుకోవాలా" అని ప్రశ్నించారు.

 

"దేవినేని ఉమా బ్రోకర్ పనులు చేస్తూ ఉంటాడు, చంద్రబాబుకు భజన చేస్తూ ఇన్నాళ్లు చంద్రబాబు సూటుకేసులు మోశాడు. రాష్ట్రంలోని మంత్రులు కూడా జగన్ కు అలాగే చేస్తారు అనుకుంటాడు దేవినేని ఉమా. ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే రూ 1000 కోట్లు, రూ 2500 కోట్లు అంటూ డబ్బు గురించే మాట్లాడతాడు. పదవి పిచ్చి, డబ్బు పిచ్చి తప్పా ఇంకోటేమీ తెలీదు దేవినేని ఉమాకి" అని సమాధానం ఇచ్చారు నాని.

 

అసలు టీడీపీలో నుంచి ఎందుకు బయటకు వచ్చారు అని నానిని ప్రశ్నించగా "టీడీపీలో చంద్రబాబుకు, హరికృష్ణకు మధ్య వారసత్వ వివాదాలు జరుగుతున్నపుడు నేను టీడీపీ పార్టీలోకి వచ్చాను అప్పుడు కూడా నేను హరికృష్ణకే మద్దతు ఇచ్చాను. "అన్న తెలుగుదేశం" పార్టీ పెట్టి హరికృష్ణ నా ఊరు వచ్చి మీటింగ్ పెడితే పక్కన ఉండి సపోర్ట్ చేశాను. అప్పుడు చంద్రబాబు హరికృష్ణను వదిలేసి వచ్చేయ్ పార్టీలో మంచి పదవి ఇస్తా అన్నారు అయినా వెళ్ళలేదు నేను అని చెప్పారు.

 

ఇక తరువాతి కాలంలో 2004 లో మేము ప్రతిపక్షంలో ఉన్నాం, నేను ప్రతిపక్షం అని చూడకుండా వైఎస్ రాజశేఖరరెడ్డి నా నియోజకవర్గ ప్రజలకు నేను అడిగిన అన్ని పనులు చేసిపెట్టారు అప్పటి నుంచి వైఎస్ అంటే అభిమానం. జగన్ ను టీడీపీ మరియు కాంగ్రెస్ కుట్ర చేసి జైలుకు పంపారు, పార్టీ విధానం నచ్చక మరియు వైఎస్ కుటుంబంపై అభిమానంతో వైసీపీలోకి వచ్చాను అని తెలిపారు నాని. 

మరింత సమాచారం తెలుసుకోండి: