గత ఐదేళ్లలో చంద్రబాబు తీసుకున్న యూ టర్న్ లు .. మాట మార్చడం ప్రజల్లో బాబు ప్రతిష్టను బాగా దిగజార్చినాయి. అయినా బాబు గారు ఇంకా తన యూ టర్న్ లు మాత్రం మానడం లేదు. తాజాగా ఇప్పుడు బీజేపీకి దగ్గరవుతూ మరో పెద్ద యూ టర్న్ తీసుకున్నారు. లోక్ సభ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కమలం పార్టీ విషయంలో ఎలా స్పందించారో ఇప్పుడేం చెప్పనక్కర్లేదు. మోడీ మీద ఒంటి కాలితో లేచారు చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు మోడీ విషయంలో చంద్రబాబు నాయుడు రూటు మారిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి.  ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు బీజేపీ మీద ఒక రేంజ్ లో రెచ్చిపోయారు. వేరే రాష్ట్రాలకు వెళ్లి బీజేపీ వ్యతిరేక ప్రచారం చేశారు కూడా. ఇక మోడీ మీద వ్యక్తిగత విమర్శలకూ వెనుకాడలేదు.

 

నరేంద్ర మోడీ మీద ఉదయాన నుంచి నిద్ర పోయే వరకు మీడియాలో మోడీని విమర్శించడానికే బాబుకు టైం సరిపోయింది. మోడీ భార్య పేరు ప్రస్తావించి మరీ విరుచుకుపడ్డారు చంద్రబాబు నాయుడు. ఇటీవల మాట్లాడుతూ.. తను మోడీ వ్యక్తిగత విషయాల మీద కామెంట్ చేయలేదన్నట్టుగా వ్యక్తిగత వైరం లేదన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అయితే చంద్రబాబు నాయుడి అవకాశవాదం గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీతోనే జట్టుకట్టినప్పుడే చంద్రబాబు నాయుడు ఆ అవకాశవాదాన్ని పరాకాష్టకు తీసుకెళ్లారు. ఎదురుదెబ్బ తిన్నారు. అయినా యూటర్న్ లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు మరింత డోలాయమాన స్థితిలోకి పడిపోయారని అంటున్నారు పరిశీలకులు.



ఈ  మధ్య బాబు గారు కొంచమైనా సిగ్గు శరం లేకుండా మళ్ళీ బీజేపీని పొగుడుతున్నారు. అది భారతీయ జనతా పార్టీ విషయంలోనే. ప్రస్తుతానికి అయితే చంద్రబాబునాయుడు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. అందు కోసం కాషాయధారుల కాళ్ల మీద పడుతూ ఉన్నారు ఆయన. ఆ సంగతలా ఉంటే.. వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రాభవానికి చెక్ పడుతూ ఉంది. మొన్నటి వరకూ డెబ్బై శాతం దేశాన్ని రాష్ట్రాల వారీగా బీజేపీ పాలించేది. అలాంటిది ఇప్పుడు నలభై శాతానికి పడిపోయింది. అతి త్వరలోనే కీలకమైన రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. వాటిల్లో గనుక కమలం పార్టీ నెగ్గుకు రాలేకపోతే ఆ పార్టీ కి కేంద్రంలో కూడా కౌంట్ డౌన్ మొదలైనట్టే అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: