ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను   ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు.  ముఖ్యంగా మద్యంపై జగన్ చాలా  సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే.  మద్యం పాలసీని తీసుకొచ్చి ఇప్పటికే మద్యం దుకాణాలను తగ్గించేసారు.  ప్రభుత్వమే సొంతంగా మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది.  మద్యం ఏరులై పారకుండా ఉండేందుకు తగిన ప్రయత్నం చేస్తున్నది.  మద్యం విక్రయాలను తగ్గించడంతో పాటు మద్యం ధరలను కూడా భారీగా పెంచడంతో మద్యం అమ్మకాలు ఏపీలో రికార్డు స్థాయిలో తగ్గిపోయాయి.  


పైగా ప్రభుత్వమే దుకాణాలను నిర్వహిస్తుండటంతో ఈ అమ్మకాలు తగ్గినట్టు తెలుస్తోంది.  ఖచ్చినతమైన పని వేళలను ప్రభుత్వం నిర్ణయించింది.  ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు ఉంటాయి.  ఆ తరువాత అస్సలు మద్యం అమ్మకాలు జరగవు.  బెల్ట్ షాపులను ఎత్తివేయడం, పర్మిట్ రూమ్ లను తీసివేయడంతో మద్యం అమ్మకాలు తగ్గిపోయినట్టు తెలుస్తోంది.  


అయితే, చాలా చోట్ల తెలంగాణ నుంచి అక్రంగా మద్యం సరఫరా అవుతున్నది.  అయితే, ప్రభుత్వం దీనిని ఎప్పటికప్పుడు అరికడుతూనే ఉన్నది ప్రభుత్వం.  తెలంగాణ బోర్డర్ లో ఉండే గ్రామాల నుంచి మద్యం ఏపీలోకి మద్యం సరఫరా అవుతున్నట్టు తెలుస్తోంది.  కానీ, ఏపీలో మద్యం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే ఉన్నది.  ఇప్పుడు ప్రభుత్వం దీనిపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది.  


గ్రామాల్లో బెల్ట్ షాపులు పెరిగాయని, ప్రభుత్వానికి తెలియకుండా బెల్ట్ షాపుల్లో చీప్ లిక్కర్ వంటికి భారీ ధరలకు అమ్ముతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది.  ప్రతి పక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, కావాలనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని అంటోంది ప్రభుత్వం.  ప్రభుత్వం సరిహద్దు గ్రామాల్లో నిఘాను పెంచింది.  అక్రమంగా మద్యం అమ్మేవాళ్ళకు కఠినమైన శిక్షలు విధిస్తామని అంటోంది ప్రభుత్వం.  

మరింత సమాచారం తెలుసుకోండి: