తెలుగుదేశం పార్టీ ప్రస్తుత తీరు చూస్తే ఎవరికైన‌ కలిగే అనుమానం ఒకటే. నాయకత్వ సంక్షోభం ఎదుర్కొంటున్న ఈ పార్టీ మరిన్ని ఎన్నికలను చూడగలదా అన్నదే ఆ డౌట్. చంద్రబాబు వంటి నాయకుడు ఉండగా టీడీపీకి లీడర్ షిప్ క్రైసిస్ ఏంటి అన్న ప్రశ్న రావచ్చు. కానీ బాబు వయోభారమే ఇపుడు పార్టీకి అసలైన సమస్యంగా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి అంటే 2024 నాటికి బాబు వయసు 75కి చేరుకుంటుంది. ఆయన నాయకత్వం మీద ఎవరికీ అపనమ్మకం లేకపోయినా ఆయన వయసు మీదనే పెద్ద ఎత్తున ఆలోచనలు జరుగుతున్నాయి.

 

ఇదిలా ఉండగా టీడీపీ ఉనికి విషయంలో చంద్రబాబు కూడా గట్టిగానే ఆలోచనలు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఈ మేరకు ఆయన కర్నూల్ జిల్లా టూర్లో సంచలనమైన ప్రకటనలు చేశారు. టీడీపీ పని అయిపోయిందని, అంతరించిపోతోందని రాష్ట్రంలో ప్రచారం సాగుతోందని, అయితే అది వారి భ్రమ మాత్రమేనని బాబు గట్టిగా క్యాడర్ కి చెప్పారు.

 

భావితరాల కోసం టీడీపీ మరో ముప్పయ్యేళ్ళ పాటు నడించేలా గట్టి నాయకత్వాన్ని తాను తయారు చేస్తున్నానని కూడా బాబు అన్నారు. 65 లక్షల సభ్యత్వం కలిగిన ప్రాంతీయ పార్టీ దేశంలో ఒక్క టీడీపీ మాత్రమేనని కూడా బాబు అన్నారు. టీడీపీ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలూ అక్కర‌లేదని, తమ పార్టీకి సుదీర్ఘ‌మైన భవిష్యత్తు ఉందని బాబు చెప్పారు.

 

ఇలా ఉన్నట్లుండి బాబు టీడీపీ మనుగడ గురించి కామెంట్స్ చేయడం పట్ల అటు పార్టీలోనూ, ఇటు బయటా కూడా చర్చ సాగుతోంది. టీడీపీ నుంచి పెద్ద నాయకులు జంప్ చేయాలని చూడడం, అదే సమయంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా సైలెంట్ గా ఉండడం, నాయకులు ఎవరికి తోచినట్లుగా వారు వ్యవహరించడంతోనే బాబు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. చూడలి మరి బాబు వ్యాఖ్యలతోనైన పార్టీ రూట్ మారుతుందేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: