ఈమధ్య ఆన్లైన్ ప్రపంచంలో బతికేస్తున్నారు జనాలు . ఏం కావాలన్నా ఆన్లైన్లో ఒక క్లిక్ చేస్తే చాలు అది ఇంటికి వచ్చి చేరుతోంది. దీంతో ఎక్కడికో వెళ్లి ఏదో కొనాల్సిన అవసరం లేకుండా పోయింది. మొబైల్ చేతిలో ఉంటే చాలు అన్ని మన చెంతకే చేరుతున్నాయి.  దీంతో ఈ కామర్స్ సైట్లలో  రోజురోజుకు మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. కస్టమర్లు ఎంతో ఆశతో తమకు కావాల్సిన వస్తువుని ఆర్డర్   చేస్తే చివరికి అది డెలివరీ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే మాత్రం షాక్ అవ్వక  తప్పడం లేదు. ప్రస్తుతం కేరళలో ఓ  కస్టమర్ కి ఇలాంటి ఘటనే ఎదురైంది . ఎంతో ఆశగా కెమెరా బుక్ చేసాడు ఆ వ్యక్తి కానీ డెలివరీ అయ్యాక  ఓపెన్ చేసి చూస్తే మాత్రం అందరూ కెమెరాకి బడులు  టైల్స్ వచ్చేసాయి. దీంతో అవాక్కవడం ఆ వ్యక్తి వంతయింది. కేరళలో ఈ ఘటన జరిగింది. 

 

 

 

 ఈ కామర్స్ దిగ్గజం  ఫ్లిప్కార్ట్ కేరళలోని ఓ కస్టమర్ కి బిగ్ షాక్ ఇచ్చింది. వారం రోజుల పాటు అన్ని రివ్యూలను చదివి... చివరకు కెమెరా ని ఆర్డర్ చేసాడు  విష్ణు సురేష్. అయితే సురేష్ ఆర్డర్ ఇచ్చిన కెమెరా 27,500 రూపాయలు. ఫ్లిప్ కార్టు కి  అంత పెద్ద ఆర్డర్ వచ్చినప్పుడు డెలివరీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతో జాగ్రత్తగా ఆర్డర్ను ప్యాకింగ్ చేసి డెలివరీ చేయాలి. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. సురేష్ ఆర్డర్  చేసిన కెమెరా చివరికి డెలివరీ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే అందులో టైల్స్  ఉన్నాయి. అది చూసిన సురేష్ షాక్ అయ్యాడు. ఫ్లిప్కార్ట్ కి ఇకార్ట్  లాజిస్టిక్స్ అనే అనుబంధ సంస్థ ఉంది. దానిద్వారా కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ చేస్తూ ఉంటుంది. నవంబర్ 24న సురేష్ కెమెరా ని ఆర్డర్ చేసాడు. కానీ చివరికి పార్సీల్లో  మాత్రం టైల్స్ వచ్చాయి. 

 

 

 

 ఇది అనుకోకుండా జరిగింది అనుకుంటే మాత్రం పొరబాటే... ఎందుకంటే సురేష్ కి కెమెరా కు బదులు వచ్చిన పార్సిల్ బాక్స్ లో  టైల్స్ తో పాటు కెమెరా మ్యాన్యువల్,  వారంటీ కార్డు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇది కావాలనే జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో వెంటనే ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ కి కాల్ చేసాడు సురేష్.  వారంలోగా కొత్త కెమెరా పంపుతామని చెప్పారు. అయితే తప్పుడు పార్సిల్ ఎందుకు వచ్చిందో ఫ్లిప్కార్ట్ చెప్పలేదు. కానీ వారంలోగా కొత్త కెమెరా పంపుతాము  అంటూ చెప్పిన ఫ్లిప్ కార్ట్   తప్పు చేసినట్లు అంగీకరించినట్లే. ఈమధ్య డెలివరీ బాయ్స్ కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వాదనలు కూడా వస్తున్న విషయం తెలిసిందే. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఫ్లిప్కార్ట్ లో ఏదైనా ఆర్డర్ చేస్తే వచ్చే వరకు ఏం వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: