దిశ   ఉదంతం యావత్ భారత దేశాన్ని అతలాకుతలం చేసింది.  అమ్మాయిలకు సెక్యూర్ లేకుండా పోతున్నది.  అమ్మాయి అంటే దానికోసమే ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారు.  దానికోసమే ఉన్నారు అని భావిస్తున్నారు.  అందుకే దానికోసం అమ్మాయిలను ఇష్టం వచ్చినట్టుగా ట్రాప్ చేస్తూ ఏదో విధంగా బుట్టలో వేస్తున్నారు.  నానా రకాలుగా హింసిస్తున్నారు.  బాధపెడుతున్నారు.  అవమాన పడేలా చేస్తున్నారు.  మానప్రాణాలను హరించేస్తున్నారు.  


2012లో నిర్భయ కేసు తరువాత ఇప్పుడు దేశంలో అంతటి పెను సంచలనం సృష్టించిన దారుణకాండ ఇది.  దిశ కోసం దేశం యావత్తు ప్రార్ధనలు చేసింది.  బయటకు వచ్చి నినాదాలు చేసింది.  దిశ ఆత్మకు శాంతి చేకూరాలని ర్యాలీలు చేశారు.  నిందితులను పట్టుకున్నారు.  జైలులో పెట్టారు.  ఉపయోగం ఏంటి.  నిందితులకు కఠినంగా శిక్షించినపుడే కదా న్యాయం జరిగేది.   నిందితులకు శిక్షలు ఎప్పుడు వేస్తారు.. ఏమో చెప్పలేం.  ఎప్పుడు వేస్తారో తెలియదు.  


ఇక ఇదిలా  ఉంటె,   రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన 28 ఏళ్ల నీతూ చోప్రా బలోత్రా నుంచి కన్యాకుమారి వరకు 3200 కిలోమీటర్లు ఒంటరిగా తన బైక్ పై ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకున్నది.  దిశకు సపోర్ట్ చేసేందుకు, మహిళలను చైతన్యం చేసేందుకు ఈ యాత్రను చేయబోతున్నట్టు ఆమె ప్రకటించింది.  జైపూర్ వెళ్లి అక్కడ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను కలిసి తన యాత్ర గురించి తెలిపి అక్కడి నుంచి తన ప్రయాణం సాగించబోతుందట.

 
ప్రతి మహిళ కూడా ధైర్యంగా ఉండాలని, ధైర్యంగా పోరాటం చేయాలని, మహిళలు రఫ్ అండ్ టఫ్ గా ఉంటేనే మగాళ్లు టచ్ చేయడనికి భయపడతారని అంటున్నారు.  ఆదివారం రోజున ఆమె కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిశారు.  తన మిషన్ గురించి వివరించారు.  తనను తాను ఓ సైనికురాలిగా పేర్కొన్నారు.  అలానే దిశపై అత్యాచారం చేసిన వాళ్ళను మాములు నిందితుల్లా కాకుండా తీవ్రవాదులుగా భావించాలని, అప్పుడే వారికీ కఠినమైన శిక్షలు విధించగలమని అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: