తెలుగు సినీరంగంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుపతిలో తెలుగు వైభవం పేరుతో పలువురు భాషపండితులతో ప్రత్యేక సమావేశాన్ని పవన్ కల్యాణ్ నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ... తెలుగు సినిమా హీరోల భాషపై ఘాటుగా స్పందించారు. చాలా మంది తెలుగు సినిమా హీరోలకు తెలుగు మాట్లాడం తెలుసో లేదో నాకు తెలియదు కానీ రాయడం మాత్రం సరిగా రాదన్నారు.

 

అంతేకాదు.. నేటి తరం హీరోలపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తెలుగు సినిమాలు చేస్తారు, డబ్బులు ఇక్కడే సంపాదిస్తారు. కానీ తెలుగు మాట్లాడటం, ఉచ్చరించడం మాత్రం తెలియదు. ఒక తెలుగు హీరోగా నాకు ఇవన్నీ ఆవేదన కలిగించాయి. మన భాషా, సంస్కృతులను కాపాడుకోలేకపోతే అధోగతి పాలవుతాం.. అంటూ పవన్ కల్యాణ్ తెగ బాధపడిపోయారు.

 

తెలుగు సినిమా హీరోలపై నటుడు, చాలా మంది తెలుగు సినిమా హీరోలకు తెలుగులో మాట్లాడటం తెలుసో లేదో తెలియదు కానీ తెలుగులో రాయడం అస్సలు తెలియదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలు తెలుగు సినీరంగంలో కలకలం రేపుతున్నాయి. ఇటీవల తెలుగు భాషపే అకస్మాత్తుగా ప్రేమ పెంచుకున్న పవన్ కల్యాణ్.. తెలుగు మాధ్యమం ఎత్తివేతపై జగన్ సర్కారుపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

 

కానీ భాషకూ సినిమాకూ ముడిపెడుతూ పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించడంపై సినీరంగంలోని వివిధ వర్గాల వారు విభిన్నంగా స్పందిస్తున్నారు. సినిమా అనేది క్రియేటివ్ రంగమని.. ఇక్కడ భాష అనే బంధనాలు ఉండవని కొందరు కామెంట్ చేస్తున్నారు.

 

 

భాష పేరుతో సినీ సృజనాత్మకతకు బంధనాలు వేయడం కరెక్టు కాదని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు వపన్ వై ఎదురు దాడి చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెలుగుపై ప్రేమ చూపిస్తున్న పవన్ కల్యాణ్ ఇన్నాళ్లూ ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు.. మెగా కాంపౌండ్ హీరోల్లో ఎంతమంది తెలుగు రాయగలుగుతారని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: