చూస్తుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాయలసీమ పర్యటనలో హిడెన్ అజెండా ఉన్నట్లే అనుమానంగా ఉంది. పర్యటన మొదలైన దగ్గర నుండి జనాలను రెచ్చ గొట్టడం లేకపోతే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొట్టటానికే టూర్ చేస్తున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

తన రాయలసీమ పర్యటనను కడప జిల్లా రైల్వే కోడూరుతో మొదలుపెట్టారు. కోడూరులో జరిగిన బహిరంగ సభలోనే జిల్లాలోని మైదుకూరు, పులివెందుల, కమలాపురం ప్రాంతాలకు చెందిన యువత, రైతులను పిలిపించుకున్నారు. రాయలసీమలో మానవహక్కులు పూర్తిగా హరించుకుపోయాయని మండిపడ్డారు. తాను చెప్పిందే నిజమైతే అసలు  పవన్ బహిరంగసభ పెట్టి జగన్ పై ఎలా ఆరోపణలు చేయగలుగుతున్నారు ?

 

యువకులు నడుం బిగించి పోరాటాలు చేయాల్సిన అవసరం వచ్చిందని పవన్ అంటున్నారు. ప్రభుత్వంపై పోరాటం చేయాల్సినంత అవసరం యువకులకు ఏమొచ్చింది ?  ’ఎంత కాలం బెదిరిస్తుంటారు, మీరు దాడులు చేస్తే తాము చేయలేమా’ ? అంటూ ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది.  అసలు జనసేన నేతలపై ఎవరు దాడి చేశారు ?  గ్రామస్ధాయిలో జరిగిన దాడుల్లో ఎక్కువగా వ్యక్తిగత కక్షలతో జరిగిన దాడులే ఎక్కువ.

 

ఇప్పటి వరకు ఇటువంటి ఆరోపణలు చంద్రబాబునాయుడు మాత్రమే చేస్తున్నారు. జనాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో జరుగుతున్న గొడవలను కూడా రాజకీయ దాడులుగా వర్ణిస్తు టిడిపి నానా యాగీ చేస్తోంది. తాజాగా పవన్ ఆరోపణలు కూడా చంద్రబాబునాయుడుకు మద్దతిస్తున్నట్లుగానే ఉంది.

 

మొన్ననే కడప జిల్లాలో మూడు రోజులు పర్యటించిన చంద్రబాబు కూడా ఇటువంటి ఆరోపణలే చేశారు. మాట్లాడిన ప్రతి సమావేశంలోను కార్యకర్తలను రెచ్చగొట్టటమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు పార్టీ సమావేశాల్లో మాట్లాడితే పనవ్ బహిరంగ సభలో మాట్లాడారంతే. మిగితాదంతా సేమ్ టు సేమ్. ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిపోయి నీకు ధైర్యం లేదు, నీవు చేతకాని వాడివి అంటూ పదే పదే ఆరోపణలు చేయటంతోనే పవన్ హిడెన్ అజెండా తెలిసిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: