దిశ చాలా మంచిది ఇంకా చాలా స్మార్ట్ కూడా. అందరికి సాయం చేసే గొప్ప మనసున్న అమ్మాయి. ఎవర్ని చూసిన తనలాగే మంచి వారు అనుకునేది. దిశ తన 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హసన్‌పర్తి మండలం(వరంగల్) ఎర్రగట్టు గుట్ట సమీపంలోని గ్రీన్‌వుడ్‌ పాఠశాలలో చదివింది. ఆమె 2006 లో తన 8వ తరగతిలో అడుగుపెట్టింది. ఆ సమయంలో ఒక హాస్టల్ లో ఉంటూ చదువుకునేది. నిజానికి.. ఆ కాలంలోనే దాదాపు 90 శాతం(536) మార్కులు 10వ తరగతిలో సాధించిందంటే ఆమె ఎంత తెలివైన అమ్మాయో అర్ధమవుతుంది. స్టడీస్ లో ఎంతో స్మార్ట్ అయినప్పటికీ అసలు అణువంతైనా గర్వం ఉండకపోయేది. తన ఫ్రెండ్స్ కు అన్ని విషయాలలో సాయం చేసేందుకు ముందుడేది. అందుకే గ్రీన్‌వుడ్‌ పాఠశాల ఇచ్చే మోస్ట్‌ హెల్పింగ్‌ స్టూడెంట్ పురస్కారానికి నామినేట్ అయింది. ఈ విషయాన్ని..పాఠశాల డైరెక్టర్‌ అయిన భరద్వాజనాయుడు దిశ గురించి గుర్తు చేసుకుంటూ తెలిపారు.

దిశకు వెటర్నరీ డాక్టర్ జాబ్ పోస్టింగ్ వచ్చిన తరువాత కూడా ఎంతో రిలీజియస్ గా, అంకిత భావంతో బాధ్యతలను నిర్వర్తించేది. తాను నవాబ్ పేట మండలం కొల్లూరులో వెటర్నరీ డాక్టర్ గా పనిచేసేదన్న విషయం విదితమే.. అయితే కొల్లూరుకు పక్కనున్న గ్రామాలలో పశు ఆసుపత్రి లేకపోవడంతో ప్రజలంతా వారి పశువుల చికిత్స నిమిత్తం దిశ వద్దకు వచ్చేవారు. ఒక చౌడూరుు గ్రామస్థుడు దిశ గురించి ఇలా చెప్పాడు.. 'టైం కి వచ్చి చికిత్స బాగా చేసేది. ఈ మధ్యకాలంలో ఏ డాక్టర్.. ఆమె లాగా వెంటనే స్పందించేవారు కాదు..పశువులకు ఎటువంటి చిన్న సమస్య ఉందని చెప్పిన.. వెంటనే వచ్చి చికిత్స చేసి వెళ్ళేది. డాక్టర్ అయినప్పటికీ..అందర్నీ సొంత మనుషుల లాగా అంకుల్ అని పిలిచేది.. చుట్టు ప్రక్కల గ్రామాలంతా తిరుగుతూ పశువులను పెంచండి అంటూ అవేర్నెస్ తెచ్చేది. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి సబ్సిడీ గురించి మాకు తెలియజేసేది. అటువంటి మంచి డాక్టర్ గారిని కోల్పోయినందుకు మేము బాగా బాధపడుతున్నాం." అని చెప్పాడు.


కాగా..సోమవారం రోజు.. దిశ అస్థికలను ఆమె తండ్రి జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.అక్కడే.... కుటుంబ సభ్యులతో సహా దిశకు అంతిమ సంస్కారాలు నిర్వర్తించారు.

 

https://mobile.twitter.com/AdityaK40670573/status/1201704254026633216

 

https://mobile.twitter.com/AdityaK40670573/status/1201704254026633216

మరింత సమాచారం తెలుసుకోండి: