దేశమంతటా ఒకే సిలబస్ అమలు చేయాలన్న డిమాండ్ ను కేంద్రం తోసిపుచ్చింది. ఇది సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ పార్లమెంటులో స్పష్టం చేశారు. రాజ్యంగంలో విద్య ఉమ్మడి జాబితాలో ఉందని పాఠ్యప్రణాళికలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా నిర్ణయం తీసుకోవచ్చునని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

 

అయితే పాఠ్యంశాల రూపకల్పనలో మార్గనిర్దేశం చేయడానికి జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్ వర్క్ ను ఎన్‌సీఈఆర్టీ ఏర్పాటు చేసినట్టు ఆయన ప్రకటించారు. రాష్ట్రాల విద్యా పరిశోధన, శిక్షణా మండలి వీలైతే ఎన్‌సీఈఆర్టీ విధానాన్ని అనుసరించవచ్చునని సూచించారు. అంది ఇష్టం లేకపోతే. జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్ వర్క్ ఆధారంగా సొంత పాఠ్యాంశాలను రూపొందించుకోవచ్చని తెలిపారు.

 

అంతరించిపోతున్న భాషలను సంరక్షించడానికి కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఒక పథకం ప్రవేశపెట్టినట్లు పోఖ్రియాల్ తెలిపారు. అందుకోసం విశ్వవిద్యాలయాలను స్థానిక భాషల ఆధారంగా పలు గ్రూపులుగా విభజించినట్లు వివరించారు. దీని ప్రకారం రాష్ట్రాలు సొంతంగా పాఠాలు రూపొందించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: