సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఇది. మానవత్వానికి మచ్చ తెచ్చే దారుణ ఉదంతమిది.  70 ఏళ్ల వృద్ధురాలిపై ఓ యువకుడు కామంతో కళ్లుమూసుకుపోయి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తన నానమ్మ వయసున్న వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఇప్పటికే హైదరాబాద్ లో దిశ హత్యోదంతం దేశం మొత్తం వణికిపోయింది. సోమవారం పార్లమెంట్​తోపాటు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ‘జస్టిస్​ ఫర్​ దిశ’ నినాదం మారుమోగింది. అయిన‌ప్ప‌టికీ.. ఆ ఘటన నిందితుకుల ఇంకా శిక్ష పడనేలేదు. ఈ దుర్ఘటన నుంచి ఎవరూ ఇంకా బయట కూడా పడేలేదు. కానీ... అచ్చం  అలాంటి సంఘటనలు మాత్రం రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. నిజానికి స‌మాజం ఎటు పోతుందో కూడా అర్థంకానీ ప‌రిస్థితి నెల‌కొంది. 

 

ఇక ప‌సి పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి వృద్ధుల వ‌ర‌కు ఎవ‌రికీ ర‌క్ష‌ణ లేకుండా పోతుంది అన్న‌డానికి ఈ దారుణ ఘ‌ట‌న ఓ ఉదాహ‌ర‌ణ‌. వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 70 ఏళ్ల వృద్ధురాలిపై రాంకిషన్ అనే యువకుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన రాజకీయంగా పెను దుమారం రేపింది. సోన్‌భద్ర జిల్లా అన్పర గ్రామంలో జరిగిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. యూపీ పోలీసులు రంగంలోకి దిగి బాధిత వృద్ధురాలిని ఆసుపత్రికి పంపించి చికిత్స చేపిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన రాంకిషన్ అనే యువకుడిని యూపీ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

 

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత యూపీలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలు,  బాలికలకు రక్షణ లేకుండా పోయిందని సమాజ్ వాదీ పార్టీ  చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. యూపీలో మహిళల పరిస్థితి నానాటికి దిగజారి పోతుందని, వృద్ధురాళ్లే కాదు బాలికలను అత్యంత దారుణంగా హింసిస్తున్నారని అఖిలేష్ విమర్శించారు. రాష్ట్రంలో  పరిస్థితి దారుణంగా తయారవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: