జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అనేక పథకాలు అమలు చేస్తున్నా ఓ నిర్ణయం మాత్రం సిఎంకు జనాల్లో మంచి ఆధరణ పెంచుతోంది. ఈ నిర్ణయం అమలు విషయంలో జనాల్లో వస్తున్న క్రేజును చూసే చంద్రబాబునాయుడు బాగా గింజుకుంటున్నారు.  ఇంతకీ విషయం ఏమిటంటే అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేస్తానని జగన్ చేసిన వాగ్దానం గుర్తుందా ? ఇపుడీ నిర్ణయమే  జగన్ కు మంచి పేరు తెస్తోంది.

 

జగన్ హామీ ఇవ్వగానే ఇది అమలయ్యేది  కాదని అందరూ అనుకున్నారు. కానీ చిత్తశుద్ది ఉంటే చేయలేనిది లేదని జగన్ ఆచరణలో నిరూపించారు. దాంతో రాష్ట్రంలో మద్యం వాడకం మెల్లి మెల్లిగా తగ్గిపోతోంది. మద్యం షాపులు తగ్గించటం, బార్ల సంఖ్యను కుదించటంతో పాటు రేట్లు అనూహ్యంగా పెంచేస్తానని జగన్ ఎన్నికల సమయంలో చెప్పినట్లే చేస్తున్నారు. 4380 మద్యం షాపులను 3500కి తగ్గించారు. సుమారు వెయ్యి బార్ అండ్ రెస్టారెంట్లను 600కి తగ్గించారు.

 

అదే సమయంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన బెల్టు షాపుల తాటతీశారు. చంద్రబాబు హయాంలో ఉన్న 43 వేల బెల్టుషాపులను నూరుశాతం నియంత్రించేశారు. అలాగే షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్ రూములను కూడా తీసేయించారు. ఉదయం నుండి అర్ధరాత్రి వరకు పనిచేసే మద్యం షాపులను ఉదయం 11 తెరిచి  రాత్రి 8 గంటలకు మూసేయిస్తున్నారు. షాపులను తగ్గించినా, బార్ల సంఖ్యను కుదించినా రేట్లు బాగా పెంచేయటం వల్ల ఆదాయంలో పెద్దగా తేడా కనబడలేదు.

 

ఈ నిర్ణయం అమలు విషయంలో ఎల్లోమీడియా కూడా జగన్ ను ప్రశంసిస్తోంది. ఎప్పుడైనా సరదాగా మద్యం తీసుకునే వారు, అప్పుడే మద్యానికి అలవాటు పడుతున్నవారు, యువతను మద్యానికి దూరం చేయటమే తన లక్ష్యంగా జగన్ ఎన్నోసార్లు చెప్పారు. గత ఏడాది నవంబర్ మాసంలో బీర్ల అమ్మకాలతో పోలిస్తే మొన్నటి నవంబర్ లో విక్రయాలు  54.30 శాతం తగ్గింది. ఐఎంఎఫ్ఎల్ అమ్మకాలు పోయిన నవంబర్ తో పోలిస్తే మొన్నటి నవంబర్ లో 25 శాతం తగ్గాయని ఎల్లోమీడియానే చెప్పింది. అంటే జగన్ తన టార్గెట్ రీచవుతున్నట్లే కదా ? 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: