ప్రస్తుత సమాజంలో గవర్నమెంట్ ఆఫీస్ లో లంచం ఇవ్వనిదే ఏ పని జరగదని చాలా మందికి ఒక అభిప్రాయం ఏర్పడింది. దీని మార్చాలనే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా ఒక సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఏపీ ప్రజల రక్షణ లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసిపి ఆ బాటలో అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి సంకల్పించారు.

 

 అవినీతిని నిర్మూలించడానికి 14400 అనే నెంబర్ కి కాల్ సెంటర్ ని ఏర్పాటు చేశారు.  రాష్ట్రంలో నుండి ఏ ప్రదేశం నుంచి అయినా కూడా ఈ నెంబర్ కు కాల్ చేసి వారి సమస్య గురించి చెప్పొచ్చు. ఫిర్యాదు వచ్చిన పదిహేను రోజులు లోపాల ఆ సమస్యకి పరిష్కారం పూర్తయ్యేలా సరికొత్త పథకాన్ని జగన్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. అలా ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్ కి విపరీతమైన స్పందన వస్తోంది.

 

 ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో జరిగిన అన్యాయాల గురించి ఈ నెంబర్ కు కాల్ చేసి చెప్తున్నారు. ఈ నెంబర్ కి ముఖ్యంగా ఒక జిల్లా నుంచి ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి . గుంటూరు జిల్లా నుంచి అధికంగా రెవెన్యూ, విద్యుత్, పురపాలక అధికారులపై ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటి వరకు మనము బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలన్నా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పని జరగాలన్న కూడా లంచం పెట్టంది పని జరగదని పరిస్థితి తీసుకొని వచ్చారు మన అధికారులు. ఇప్పటి వరకు అవినీతికి సంబంధించిన వాటికి దాదాపు 200 పైచిలుకు కాల్స్ వచ్చాయట.

 

 దీనిపై వచ్చిన కాల్స్ కి ఏసీబీ అధికారులు తగు చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దానికంటే ముందు అధికారులు ప్రజల నుంచి వచ్చిన ఆరోపణలు నిజం అయినవా లేక ఒట్టి ఆరోపణలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వేళ సేకరించిన వివరాలు తర్వాత ఆ అధికారి నిజంగానే లంచం అడిగినట్లు, తెలిస్తే ప్రభుత్వపరంగా కచ్చితంగా చర్యలు ఉంటాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: