జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చూస్తుంటే అపరిచితుడు సినిమాలో క్యారెక్టర్ గుర్తుకొస్తోంది. జగన్మోహన్ రెడ్డిపైనే కాకుండా ఏకంగా హిందువులపైనే నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. రాయలసీమ పర్యటనలో తిరుపతిలో అన్యమత ప్రచారం, సెక్యులరిజంపై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే పవన్  నిజంగానే అపరిచితుడైపోయినట్లే అనుమానం వస్తోంది. ఇంగ్లీషు మీడియా గురించి మాట్లాడిన పవన్  మొన్నటి వరకు జగన్ పై ఎన్నిఆరోపణలు చేశారో అందరికి తెలిసిందే.

 

ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టాలన్న జగన్ నిర్ణయం అందరికీ తెలిసిందే. దాని నేపధ్యంలో రాష్ట్రంలో క్రైస్తవాన్ని వ్యాప్తి చేయటానికి జగన్ ప్రయత్నిస్తున్నాడన్న అర్ధం వచ్చేట్లు ఎన్నో మాటలన్నారు. అలాగే తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ పరోక్షంగా జగన్ పై బురద చల్లారు. కానీ తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతకుముందు చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉన్నాయి.

 

మతాల మధ్య చిచ్చుపెట్టేది హిందువులే అంటూ ఆరోపించారు. ఇతర మతాల వాళ్ళెవరూ మతాల మధ్య గొడవలు పెట్టే పనులు చేయరని అన్నారు. అంటే మొన్నటి వరకు జగన్ క్రైస్తవుడు కాబట్టే హిందువులు-క్రిస్తియన్ల మధ్య గొడవలకు కారణం అన్న అర్ధంలో ఆరోపణలు చేశారు. మరి తాజా వ్యాఖ్యలను చూస్తే జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలు తప్పని తేలిపోయింది. అదే సమయంలో టిటిడిలో జరుగుతున్న అన్యమత ప్రచారం కూడా హిందువులే అని తేల్చేశారు. మరి మొన్నటి వరకూ జగన్ మద్దతుతోనే తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందనేట్లుగా ఎలా ఆరోపణలు చేశారు

 

పవన్ తాజా వ్యాఖ్యలను గమనిస్తే తిరుమలలో జరుగుతున్నఅన్యమత ప్రచారానికి జగన్ కు సంబంధం లేదని అంగీకరిస్తున్నట్లే కదా ? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్ కు ఏ విషయంలో కూడా అవగాహన లేదు. జగన్ విషయంలో చంద్రబాబునాయుడు ఏమని ఆరోపణలు చేస్తున్నారో అవే ఆరోపణలు పవన్ కూడా చేస్తున్నారంతే. దాంతో పవన్  అందరిలో  అపరిచితుడుగా ముద్ర వేయించుకుంటున్నారు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: