అమాయకురాలైన వైద్యురాలు  దిశను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దేశం మొత్తం హత్య చేసిన రేపిస్టులను ఉరి తీయాలని నిరసనలు  చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దిశా  హత్య కేసులో నిందితులు చల్లపల్లి జైల్ లో పోలీసు కస్టడీలో ఉన్నారు. కాగా  నేడు దిశా  హత్య కేసు నిందితులను పోలీసులు వేసిన పిటిషన్ పై  షాద్నగర్ కోర్టు నిర్ణయం తీసుకోనుంది. చర్లపల్లి జైలు దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు నిందితులను షాద్నగర్ తరలించనున్నారు . అయితే చర్లపల్లి పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు పోలీసులు .చర్లపల్లి జైలు వద్ద   పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. చర్లపల్లి పరిసరప్రాంతాల్లో ఎలాంటి నిరసనలు ఆందోళన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు విచారించారు. 

 

 

 

 హత్యకేసులో నిందితులకు తమ కస్టడీకి అప్పగించాలని... నిందితులను లోతుగా విచారించి కొన్ని నిజాలు బయటపెడతామని  పోలీసులు  కోర్టులో వేసిన పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. కాగా  పదిరోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై నేడు షాద్నగర్ కోర్టు విచారించనుంది . దిష మొబైల్ రికవరీ చేయడంతోపాటు నిందితులను స్టేట్మెంట్లను రికార్డ్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు పోలీసులు. అయితే నిందితులను కస్టడీకి తీసుకునే సమయంలో నిరసన కారుల ఇబ్బందులు ఎదురవుతాయి పోలీసులు భావిస్తున్నారు. అవసరమైతే జైల్లోనే ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 

 

 

 అయితే దిశా  హత్య కేసులో నిందితులను  తమకు అప్పగించాలని... వారికి శిక్ష విధిస్తామని చల్లపల్లి దగ్గర స్థానికులు నిరసనలు  చేస్తున్నారు. దిశా  కేసులో నిందితులను షాద్నగర్ కు  తరలించటం పోలీసులకు సవాల్గా మారింది. ప్రజలు ఆందోళనకు దిగే అవకాశం ఉందని ముందస్తు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా దిశా ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎట్టి పరిస్థితిలో నిందితులకు ఉరిశిక్ష విధించి చంపేయాలటు డిమాండ్ చేస్తున్నారు. దిశా తల్లిదండ్రులు తమ కూతురుకు పట్టిన గతి మరెవ్వరికీ పట్టకూడదని ఆ  విధంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: