అదేంటి ఈ రోజుకు ప్రత్యేకత ఏం లేదుకదా మరెందుకు చర్లపల్లి జైలు దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారని ఆలోచిస్తున్నారా. ఎన్వీలు వస్తున్నారు. అదేంటి విఐపీలు తెలుసుగాని ఎన్వీలు ఏవరని ఆశ్చరయపోతున్నారా. అదేనండి ఎన్వీ అంటే నికృష్టపు వెధవలు అని అర్ధం. మొన్న చేశారుగా సమాజం తలదించు కునేలా భరత మాత బాధపడేలా హత్యాచారం. ఆ ఎధవలే వస్తున్నారని ఈ అలజడి అంతా.

 

 

ఇకపోతే దిశ హత్యకేసు నిందితులను పోలీసు కస్టడీపై షాద్ నగర్ కోర్టు నేడు నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో... చర్లపల్లి జైలు దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించే అవకాశం ఉండటంతో... పోలీసులు నిందితులను షాద్ నగర్‌కు తరలించనున్నారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు సమీపంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. జైలు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ కూడా విధించారు.

 

 

ఈ సందర్భంగా ఎలాంటి నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేదని ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే స్థానికులు దిశ హత్య కేసు నిందితులను తమకు అప్పగించాలంటూ చర్లపల్లి దగ్గర కూడా ఆందోళన చేస్తుండటంతో నిందితులను షాద్ నగర్‌ తరలించడం పోలీసులకు సవాల్‌గా మారింది. స్థానికులు, మహిళా సంఘాలు, ప్రజలు ఆందోళనలకు దిగే అవకాశం ఉందనే ముందస్తు సమాచారంతో పటిష్ట భద్రత నడుమ పోలీసులు నిందితులను షాద్ నగర్‌కు తరలించనున్నారు.

 

 

కాని కొందరు నిజాయితీ పరుల బాధ ఎలాగ ఉందంటే వీరి కోసమని ఇంతగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చుపెట్టడం ఏంటి సార్. దొంగనా కొడుకులను విచారణ పేరుతో మేపుతున్నారు. తప్పు ఏంటో రుజువైందిగా  ఆలస్యమెందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే ఇలాంటి సంఘటన పట్ల  స్పందించే ప్రతి వారు తాము ఎంత నిజాయితీగా ఉంటున్నారో ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పదిమందితో కలిపి రోడ్దెక్కి అరవడం కాదు మీ యింట్లో మీ చుట్టుప్రక్కల ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూసుకుంటే కొంత వరకైన ఆడపిల్లలు మరికొంతకాలం బ్రతుకుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: