దేశం రోజురోజుకీ వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. దీంతో రోజురోజుకు మనుషుల ఆయుషు కూడా తగ్గిపోతుంది, అయితే దేశంలో రోజురోజుకీ కాలుష్యం పెరిగి పోవడానికి కారణం చెట్లను నరికేయటం...  రోజురోజుకు పెరిగిపోతున్న కెమికల్ ఫ్యాక్టరీ లు వాటి నుంచి వెలువడుతున్న రసాయన వాయువుల వలన కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. అయితే చెట్లను విరివిగా పెంచడం వల్ల కాలుష్యాన్ని కంట్రోల్ చేయొచ్చు అనే విషయం అందరికీ తెలిసిందే కానీ ఆ దిశగా మాత్రం ఎవరూ అడుగులు వేయరు . ఈ క్రమంలో దేశంలో రోజురోజుకు కాలుష్యం పెరిగి పోతూనే ఉంది. అయితే దేశంలో కాలుష్యం తగ్గించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాలే కాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపడుతున్నాయి. దేశ ప్రజలందరిని చెట్లను నాటేందుకు పిలుపునిస్తున్నాయి. 

 

 

 

 ఈ క్రమంలోనే తెలంగాణ సర్కారు కూడా ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ హరితహారం కార్యక్రమం ద్వారా కెసిఆర్ ప్రభుత్వం కొన్ని లక్షల మొక్కలను రాష్ట్రవ్యాప్తంగా నాటింది . అయితే ప్రస్తుతం ప్రతి గ్రామంలో కూడా మొక్కలను నాటే  బాధ్యతలు సర్పంచులకు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో  సర్పంచులు కూడా ఆయా గ్రామాల్లో ఎక్కువ మొత్తంలో చెట్లు నాటడమే కాకుండా  వాటి సంరక్షణ పర్యవేక్షణ చేస్తున్నారు. అంతేకాదండోయ్ సర్పంచ్లకు ఈ బాధ్యతలు అప్పగించడంతో... ఆయా గ్రామాల్లో నాటిన మొక్కలను ధ్వంసం చేస్తే వాటికి జరిమానాలు  కూడా విధిస్తున్నారు. 

 

 

 

 ఇదిలా ఉంటే పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం మరోసారి చర్యలు చేపట్టింది. గ్రామపంచాయతీలో అనుమతి లేకుండా ఎవరైనా చెట్లు నరికేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. చెట్లను నరికిన వ్యక్తికి మూడు వేల రూపాయల వరకు జరిమానా విధించాలి  అని ఆదేశించింది . అయితే గ్రామాల్లో అధికారులు సర్పంచులు చెట్లను కాపాడటం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా  రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది. అయితే ఇప్పటికే గ్రామపంచాయతీలో నూతన పంచాయతీ పాలకవర్గం కొలువుదీరిన తర్వాత... ఆయా గ్రామాల్లో భారీ మొత్తంలో మొక్కలు నాటే కార్యక్రమం చెప్పట్టారు .వాటి సంరక్షణ  బాధ్యతలు కూడా తీసుకున్నారు గ్రామాల సర్పంచులు. దీంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా పచ్చదనం వెల్లివిరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: