పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా మారింది తెలంగాణ ఆర్టీసీ కార్మికుల పరిస్దితి. ఏపీకి జగన్ సీయం అయ్యాక అక్కడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన విషయాన్ని పట్టుకుని, తెలంగాణ కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేపట్టారు. అయితే తెలంగాణ ఆర్టీసీకి మాత్రం సీఎం కేసీఆర్ షాకిచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని తెగేసి చెప్పారు..

 

 

దీంతో కళ్లు తెరచుకున్న కార్మికులు కాదన్న పనిలోనే మళ్లీ చేరారు. కాని ప్రజల నెత్తిన మోయలేని భారాన్ని పెట్టి నిమ్మకు నిరెత్తినట్లుగా ఉద్యోగాల్లో చేరారు. వారి అనాలోచిత నిర్ణయానికి ప్రతిఫలం తెలంగాణాలో భారీగా ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. ఎవరో చేసిన తప్పుకు ప్రజలు ఎందుకు ఈ భారాన్ని మోయాలని ఇప్పటికే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేవల 50వేయిల మంది కార్మికులు చేసిన తప్పుకు కోట్ల ప్రజానీకం భారాన్ని మోయవలసి వస్తుంది.

 

 

ఇకపోతే సిటీ బస్సు నుంచి ఇతర జిల్లాలకు తిరిగే గరుడ, సూపర్ డీలక్స్ బస్సుల వరకు అన్నింటా బస్సు ఛార్జీలు పెంచారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో రెండు రకాలుగా బస్సు ఛార్జీలు అమలవుతున్నాయి. ఇదే సమయంలో ఏపీ బస్సులు కూడా తెలంగాణలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి సర్వీసుల్లో ఏపీ బస్సుల కంటే ఛార్జీలు తెలంగాణ బస్సుల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల బస్సులు ఒకే రూట్లో తిరిగినప్పుడు రెండు రాష్ట్రాల బస్సుల్లో ఛార్జీల మధ్య చాలా తేడా తెలుస్తోంది.

 

 

అలాంటప్పుడు ఏపీ బస్సులలోనే ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే అవకాశం ఉంది. దీనికంతటికి కారణం బస్సు ఛార్జీలు కిలోమీటర్‌కు 20 పైసలు పెరగడమే. ఇక మరోవైపు తెలంగాణ బస్సు ఛార్జీల పెంపు ప్రభావం ఏపీ ప్రజలపైనా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు దాదాపుగా సమానంగా ఉన్నాయి.

 

 

ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయడానికి రెండు రాష్ట్రాల మధ్య బస్సుల రవాణాకు సంబంధించి ప్రభుత్వాల మధ్య అవగాహన కుదిరే అవకాశం ఉందని సమాచారం. టీఎస్ఆర్టీసీ నుంచి కేవలం మూడు బస్సులే ఉన్నందున వాటిలో ఎక్కువగా పెంచబోరని, ఏపీ బస్సులతో పోల్చి చూసుకుని అతి తక్కువ వ్యత్సాసం ఉండేలా అధికారులు నిర్ణయించే అవకాశం ఉందని ఏపీఎస్ ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: