జులై 22 వ తేదీన భారతీయుల ఆశల్ని, ఆశయాలను, కోట్లాది మంది కలలను మోసుకుంటూ జాబిల్లివైపు దూసుకుపోయింది చంద్రయాన్ 2.  ప్రయోగం చివరి వరకు సక్సెస్ గా నడిచింది.  మరో నిమిషంలో లాండింగ్ కాబోతుంది అనగా విక్రమ్ కూలిపోయింది.  అయితే, ల్యాండింగ్ జరగాల్సిన ప్రదేశానికి కోలోమీటర్ దూరంలో పడిపోయింది.  విక్రమ్ లాండింగ్ కూలిపోవడంతో.. దానికి సంబంధించిన శకలాల కోసం ఇస్రో, నాసా రెండు ప్రయత్నం చేశాయి.  కానీ, గుర్తించలేకపోయాయి.  


అయితే, ఈరోజు నాసా ఆ శకలాలను గుర్తించినట్టు ప్రకటించింది.  కానీ, ఆ శకలాలను గుర్తించింది నాసా కాదు... మనవాడే.  మన భారతీయుడే.  చంద్రయాన్ 2తో కానీ, నాసాతో కానీ అతనికి సంబంధం లేదు.  అతనో అర్చిటెక్ట్ ఇంజనీర్. స్వతహాగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా.  దీంతో ఈ ప్రాజెక్ట్ ను ఛాలెంజ్ గా తీసుకొని, నాసా గతంలో  తీసిన ఫోటోలను, జూన్ 22 కు ముందు ఎక్కడైతే విక్రమ్ ల్యాండర్ దిగబోతుందో ఆ ప్రాంతాలను నిశితంగా పరిశీలించాలని అనుకున్నాడు.  


ఆ ఫోటోలకు సంబంధించిన పిక్సెల్ ను నిశితంగా పరిశీలించేందుకు ఓ సాఫ్ట్ వేర్ ను తయారు చేసుకున్నాడు.  దాని ఆధారంగా కష్టపడి విక్రమ్ శకలాల జాడ కనిపెట్టాడు.  విక్రమ్  దిగాల్సిన ప్రాంతం...  దిగేసమయంలో అది ప్రయాణించిన వేగం ఆధారంగా విక్రమ్ దిగే ప్రాంతం కంటే కిలోమీటర్ అవతల దిగినట్టు గుర్తించాడు.  శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్టు చెన్నై కు చెందిన ఇంజనీర్ షణ్ముగం పరిశీలించి, తన పరిశీలనా వివరాలను నాసాకు మెయిల్ చేశారు.  


తన పరిశీలనా విధానాన్ని మెచ్చుకున్నది నాసా.  చంద్రయాన్ 2 తో కానీ, నాసా ఎల్ఆర్ఓ తో కానీ సంబంధం లేని ఓ వ్యక్తి కేవలం ఆసక్తి మేరకు మాత్రమే ఇలా విక్రమ్ ల్యాండర్ శకలాలను గుర్తించాడని నాసా కూడా ఆ విషయాన్ని గుర్తించలేకపోయినట్టు నాసా పేర్కొన్నది.  షణ్ముగం సెప్టెంబర్ 17 వ తేదీన నాసా తీసిన ఫోటోల ఆధారంగా గుర్తించి దానిని నాసాకు మెయిల్ చేస్తే... నాసాకు చెందిన ఎల్ఆర్ఓ అక్టోబర్ 14,15, 11నవంబర్  వ తేదీన మరికొన్ని ఫోటోలు తీసి దీనిని నిర్ధారించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: