రంగారెడ్డి జిల్లా కొల్లాపూర్‌లో వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ దిశ హ‌త్యాచారం మ‌రువ‌క ముందే అలాంటి ఘ‌ట‌నే తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం జి.వేమవరంలో జ‌రిగింది. 50 ఏళ్ల మహిళపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిలో ఒక‌రిని పోలీసులు ఇప్ప‌టికే అదుపులోకి తీసుకుని విచారిస్తుండ‌గా మ‌రో ఇద్ద‌రు ప‌రారీలో ఉన్న‌ట్లుగా పోలీసులు చెబుతున్నారు. మిగతా ఇద్దరిని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌త్యేక టీంల‌ను రంగంలోకి దింపిన‌ట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

 

నిందితుల కాల్‌డేటాను ప‌రిశీలిస్తున్న‌ట్లు చెప్పారు.  వేమ‌వ‌రంలో జ‌రిగిన సంఘ‌ట‌నలో మ‌హిళ‌ను కిడ్నాప్ చేసి దారుణానికి దుండ‌గులు ఓడిగ‌ట్టిన‌ట్లుగా పోలీసులు భావిస్తున్నారు.  ఘటనా స్థలంలో కారంపోడి చ‌ల్లిన‌ట్లుగా ఆధారాలు దొకికిన‌ట్లుగా తెలుస్తోంది.  సమాచారం అందుకున్న ఎస్పీ అద్నాన్ నయీం హస్మి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం సహాయంతో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు 24 గంటల్లోనే కేసును ఛేదిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ ఘ‌ట‌న జిల్లాలో పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఇలాంటి వ‌రుస సంఘ‌ట‌న‌ల‌తో రెండు తెలుగు రాష్ట్రాల త‌ల్లడిల్లి పోతున్నాయి.

 

మ‌రో ఇద్ద‌రు దొరికితే ద‌ర్యాప్తు వేగ‌వంత‌మ‌వుతుంద‌ని ఎస్పీ తెలిపారు. నిందితులు రాష్ట్రం విడిచి పారిపోకుండా తెలంగాణ స‌రిహ‌ద్దు జిల్లాల చెక్ పోస్టుల వ‌ద్ద కూడా నిఘాను ఏర్పాటు చేసిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుల‌ను ప‌ట్టుకుని ఉరిశిక్ష విధించాల‌న్న డిమాండ్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు వినిపిస్తుండ‌ట వారిలో గూడుక‌ట్టుకున్న ఆవేశానికి నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పాలి. ఈ సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దిశ హ‌త్యాచారం సంఘ‌ట‌న దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.

 

పార్ల‌మెంటులో లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో స‌భ్యులంద‌రూ ముక్త‌కంఠంతో ఖండించారు. క‌ఠిన చ‌ట్టాలు తీసుకురావాల‌ని స‌భ్య‌లంద‌రూ కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని కోరారు. దిశాపై హ‌త్యాచారం జ‌రిపిన న‌లుగురికి ఉరిశిక్ష అమ‌లు చేయాల‌ని, అవ‌స‌ర‌మైతే వెంట‌నే చ‌ట్టాల‌ను స‌వ‌రించాల‌ని కూడా ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ఆవేద‌న‌తో కూడి స్వ‌రాన్ని వినిపించ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: