నల్లగొండ దగ్గరలో ఉన్నటువంటి అద్దంకి – నార్కట్‌పల్లి రోడ్డుపైన ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే నల్లగొండ రూరల్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి  తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి ఒంగోలు వెళ్తున్న గాయత్రీ ట్రావెల్స్‌కు చెందినటు వంటి బస్సు నల్లగొండ మండలం చర్లపల్లి వద్దకు వచ్చిన సమయంలో ముందునుంచి పొగలు రావడాన్ని బస్సు  డ్రైవర్‌ గమనించడం జరిగింది. డ్రైవర్ వెంటనే మేల్కొని తన దైన రీతిలో వెంటనే బస్సును రోడ్డుపక్కకు వారగా నిలిపి అందులో ప్రయాణము చేస్తున్న 30 మంది ప్రయాణికులను లగేజీతో సహా కిందికి దింపడం జరిగింది.

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=GAYATRI' target='_blank' title='గాయత్రీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గాయత్రీ</a>  ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

 

ఆ  తరువాత ఏమయిందో కనుక్కోవడానికి బస్సు ఎక్కి  గమనించడం జరిగింది. అనంతరం బస్సు ఇంజెన్‌ వైర్ల షార్ట్‌ సర్క్యూట్‌తో పొగలు రావడాన్ని గమనించి ఆర్పేందుకు చాలా ప్రయత్నము చేసాడు డ్రైవర్. దగ్గరలో కనిపించిన ఇసుక, నీటిని పోసి పొగలు అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ మరింత ఎక్కువగా మంటలు రావడం గమనించి డ్రైవర్‌ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లోని పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది.

 

వాళ్లు వచ్చేటప్పటికే బస్సులో మంటలు చెలరేగి బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. కొంచెం సేపటికే పోలీసులు అగ్ని మాపక అధికారులు అక్కడికి చేరుకున్నారు పోలీసులు, అగ్నిమాపక అధికారులు వచ్చే లోపే బస్సులో మంటలు చాలావరకు ఎగిసిపడ్డాయి. తుదకు ఎలాగైతేనేమి అగ్నిమాపక అధికారులు మంటలను ఆర్పి వేయడం జరిగింది..  ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. చివరికి  ప్రయాణికులకు ఎటువంటి ఆపద కలగకుండా డ్రైవరు ముందు జాగ్రత్తగా అందరినీ బస్సులో నుంచి దించి వేసినందున పెద్ద పెను ప్రమాదం నుంచి ప్రయాణికుల అందరిని సురక్షితంగా కాపాడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: