ఈ కాలపు ఆడపిల్లలు ఒక్కోసారి వారి వెరీ చేష్టలతో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతున్నది ఈ పరిస్థితికి ఆడపిల్లలను తప్పు పట్టవలయునో, గారాబంగా పెంచుతున్న తల్లిదండ్రులను తప్పు పట్టవలయునో, మగ పిల్లలను తప్పుపట్టవలయునో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతున్నది. హిమాయత్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఇంజినీరింగ్ చదువుతూ ఉత్తరము రాసి కనిపించకుండా పోయిన మౌనిక ఉదంతము ఒక్కో రోజుకో ఒక్కో విధముగా కొత్త ట్విస్ట్‌ బయటకు వస్తున్నది.. ఓ యువకుడు తనను వేధిస్తున్నాడని  రోజు బాధపడుతున్నాడని, హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసి వెళ్లిపోయింది.

 

అలా ఉత్తరము వ్రాసి పోయిన మౌనికను  పోలీసులు గుంటూరులో అదే తనను బాధపెడుతున్నాడు అన్న యువకుడితో కలిసి పట్టుకోవడంతో పోలీసు వ్యవస్థ ఆశ్చర్య పడవలసి వచ్చినది. అతడితో మౌనిక ప్రేమ పెళ్లి చేసుకునేందుకు ఆమె ఇదంతా నాటకం ఆడుతున్నట్లు అంతా అనుకున్నారు. అయితే పోలీసుల విచారణలో మౌనిక మరొక రకమైన సమాధానము చెప్పింది.  ఆసక్తిరకమైన విషయాలు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.

  మౌనిక, ఆ యువకుడిది నిజామాబాద్‌ జిల్లా నవీపేట గ్రామం అని చిన్నప్పటినుంచి ఇద్దరికీ బాల్యం నుంచే పరిచయం ఉంది అని తెలిపింది. ఇద్దరూ ప్రేమించుకుని కలిసి మెలిసి తిరిగేవార మని. ఆ సందర్భంలో అనేక రకాలైన, వివిధ రకాల, ఫొటోలు కూడా తీసుకున్నారు. కొంతకాలానికి వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా విడిపోయారు. . కొన్ని రోజులకు ఆ అబ్బాయి కూడా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేయడానికి నగరానికి బయలుదేరి వచ్చాడు. మళ్లీ అక్కడ ఇద్దరూ కలుసుకో సాగారు. మళ్లీ ప్రేమించుకుందామంటూ ఆ యువకుడు ఆమెను వేధించడం మొదలు పెట్టారు. తరుచూ ఫోన్లు చేస్తూ నిత్యము బాధ పెట్టే వాడు. కాలేజీకి, హాస్టల్‌‌కు వచ్చి వేధించేవాడు.

 

  తనను ప్రేమించకపోతే మనము ఇదివరకు తీసుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో పెట్టి వైరల్ చేస్తానని మౌనికను బెదిరించడం జరిగినది.ఆమె ట్యాంక్‌బండ్‌లో దూకి చచ్చి పోవాలని నిర్ణయించుకుని లేఖ రాసి వెళ్లిపోయింది. తర్వాత తనను వేధిస్తున్న అబ్బాయి రూమ్‌కి తానే సొంతంగా వెళ్లి ఫోన్లో ఉన్నటువంటి ఫోటోలు మరి డిలీట్ చేసి వచ్చింది.


  అయితే ఆ యువకుడు వేరొక ఫోన్లో కూడా మన ఇద్దరి ఫోటోలు ఉన్నాయని, తనను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని బెదిరించాడు. దీంతో మౌనికగత్యంతరం లేక అతడితో గుంటూరు వెళ్లింది. గుంటూరులో ఇద్దరూ పెళ్లికి ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమయంలోనే నారాయణగూడ పోలీసులు వారి ఆచూకీ కనుక్కుని పట్టుకోవడంతో కథ సుఖాంతమైంది. వారిద్దరిని సోమవారం హైదరాబాద్ తీసుకొచ్చారు. పోలీసులు ఇద్దరిని వేర్వేరుగా విచారించడం జరిగింది. తరువాత ఆ యువతిని వైద్య పరీక్షల కోసముఆస్పత్రికి తరలించారు ఈ ఘటనపై పూర్తి విచారణ కొనసాగుతోందని, ఇంకా వివరాలు ఇప్పుడే ఇప్పుడే చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. ప్రజలు ఇరువురి తల్లి.దండ్రులకు ముందు విషయము తెలియజేస్తే బాగుంటుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: