సూర్యుడు ప్రతీ రోజూ తన డ్యూటీ తాను చేస్తాడు, కచ్చితంగా తెల్లారుతూనే తూర్పున ఉదయిస్తాడు, మధ్యాహ్నానికి నడి నెత్తిన నిలిచినా సాయంత్రం  పడమర కొండలకు జారిపోయి బై బై చెప్పేస్తాడు. మరి సూర్యుడు ఒక్క రోజు తన జాబ్ కి లీవ్ పెడితే ఎలా ఉంటుంది. ప్రపంచం తల్లకిందులవుతుంది. సూర్య రశ్మి తాకని జీవులూ జీవితాలు మనుగడ సాగించలేవు కదా.  వానలు వరసగా పడితేనే ఎపుడు సూర్యుడు వస్తాడా అని అంతా ఎదురుచూస్తారు. 

 

ఇవన్నీ అందరికీ తెలిసినవే అయితే తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. అసలు సూర్యుడు కనీసం రెండు నెలల పాటు ఆ వైపు వెళ్ళకుండా సెలవు పెట్టే ప్రాంతం ఒకటి  ఈ భూగోళం  మీద ఉందంటే నమ్మాలి మరి. అమెరికాకు ఉత్తర దిశగా ఉన్న అలస్కాలోని ఉగ్గియాగ్విక్  ప్రాంతంలో సూర్యుడు పూర్తిగా కనిపించకుండా రెండు నెలలకు పైగా అద్రుశ్యమైపోతాడట.

 

ఇక్కడ ఏడాదిలో 67 రోజుల పాటు పూర్తి చీకటిగా ఉంటుందట.   సూర్యుడు అక్కడ భూతల సమాంతరాని కంటే ఆరు డిగ్రీలు తక్కువగా ఉండడంతో ఆ ప్రాంతంలో పూర్తిగా చీకటిగా ఉంటుందిట.  రోజుకు కేవలం ఆరు గంటలు మాత్రమే వస్తువులు చూడగలిగేటంట కాంతి అక్కడ ప్రసరిస్తుందని తెలుస్తోంది. 

 

ప్రస్తుతం నవంబర్ 18వ తేదీన చివరిసారిగా  అక్కడ  భూమి  సూర్యుడిని చూడగా మళ్ళీ 2020 జనవరి 23 వరకూ   పూర్తిగా సెలెవు తీసుకున్నాడుట.   అంటే అప్పటివరకూ అక్కడ సూర్యుడి నీడ కూడా పడదన్నమాట. ఆ చిమ్మ చీకట్లోనే ఈ ప్రాంతం పూర్తిగా మగ్గాల్సివుంటుందట. నిజంగా ఇది ఒక వింతగానే వుంది కదూ.


                                                                 

మరింత సమాచారం తెలుసుకోండి: