వైద్యురాలి హత్య, అత్యచారం కేసులో మొబైల్ ఫోను నిందితులను పట్టించడంలో కీలకమైన పాత్ర పోషించింది. అయితే పోలీసులు ఆ ఫోన్ కోసం వెతకపోతున్నారంట. ఎందుకంటే దిశ ఎ1/ప్రధాన నిందితుడు మహ్మద్ అరిఫ్‌తో రెండు సార్లు ఫోన్లో మాట్లాడింది. ఫోన్ చేసిన ప్రతి ఒక్కసారి 6 నిముషాలు పాటు దిశ..మహ్మద్ అరిఫ్‌తో మాట్లాడింది. అయితే.. వాళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందని తెలుసుకుంటే.. మరిన్ని అంశాలు బయటపడతాయని సైబరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. సన్నిహితుల చెప్పిన దాని ప్రకారం.. దిశ మొబైల్ లో ఆటో కాల్ రికార్డింగ్ అనే ఆప్షన్స్ ఉంది...సో, మహ్మద్ అరిఫ్‌ ఏం మాట్లాడాడో ఫోన్ దొరికిన వెంటనే తెలియనున్నది. ఫోన్ ని మంటల్లో వేసి కాల్చేశారా? లేకపోతే ఎక్కడైనా దాచిపెట్టారా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. మహ్మద్ అరిఫ్‌తో దిశ మాట్లాడుతున్న సమయంలో మిగిలిన ఇద్దరు దోషులు దిశను వెనుకనుంచి పట్టుకొని తీసుకెళ్లారని పోలీసులు భావిస్తున్నారు.

సెల్ ఫోన్ దొరికితే వాళ్లు పట్టుబడతారెమోననే భయంతో దాన్ని ద్వంసం చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ సంబాషణ గురించి విచారణ సమయంలొ ప్రశ్నించినప్పుడు ఒక్కో నిందితుడు ఒక్కో విధంగా సమాధానాలు చెప్తుండంతో...ఫోన్ దొరికితే నిజమైన అంశాలు బయటకి వస్తాయని అధికారాలు భావిస్తున్నారని సమాచారం. షాద్ నగర్ సీఐ సురేందర్, ఇంకో పోలీసు అధికారి శ్రీధర్ ఇద్దరు కలిసి దోషులను కస్టడీలోకి ఇవ్వాలని కోర్ట్ కి పిటిషన్ దాఖలు చేసారు. అయితే ప్రొసీజర్ అంత పూర్తిగా అయిపోయిందనిి.. న్యాయస్థానం ఈరోజు సాయంత్రం పర్మిషన్ ఇస్తుందని తెలుస్తుంది...దాంతో నిందితులని 10 రోజులు కస్టడీ లోకి తీసుకొని... లోతుగా విచారణ చేసే ఉద్దేశంతో వారిని ఘటన స్థలానికి తీసుకెళ్లి సీన్ టూ సీన్ రికాన్స్ట్రుక్టు చేయబోతున్నారని సమాచారం. కస్టడీలోకి తీసుకున్న వెంటనే.. మొట్టమొదటిగా భారీ భద్రతల నడుమ నిందితులతో ఫోన్ వెతికించనున్నారని తెలుస్తుంది. అయితే విచారణను మొత్తం పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచాలని భావిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: