ఇటీవల ఒక విచిత్రమైన సంఘటన ఉమ్మడి  వరంగల్ జిల్లాలోని జనగామ లో చోటుచేసుకుంది. ఆర్టీసీ సమ్మెతో మొన్నటి  వరకు జీతాలు లేక అలమటిస్తున్న కార్మికులను చూసి ప్రతిఒకరు చలించి పోయారు. అయితే వారి బాధలు చూడలేక సీఎం కెసిఆర్ వారిని మళ్ళి విధులకు హాజరుకావొచ్చు అని ప్రకటించడం అలాగే మంచి ప్రతిఫలాలు అందించడం తో సంతోషంగా వారి విధులకు హాజరుఅవుతున్నారు. అయితే ఆర్టీసీ డ్రైవర్లు  బస్సు లలో రూట్ మ్యాప్ చూసుకోవడానికి ఇచ్చిన  ట్యాబ్‌లను  కొందరు  దుర్వినియోగం చేస్తున్నట్లు ఈ ఘటనను  బట్టి తెలుస్తోంది. అదేమిటి అని వివరాల్లోకి వెళితే ఇటీవల ప్రవేశపెట్టిన ఏసీ వజ్ర బస్సులో ఓ డ్రైవర్ నీలిచిత్రాలు చూస్తూ బస్సు నడిపిస్తున్నాడని తోటి ప్రియాణికుడు చెప్పడం తో నిజమే నాని తేలింది.  ఇది గమనించిన నాగలింగం అనే ప్రయాణికుడు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మధ్య  జరిగిన ఈసంఘటనకు  సంబంధించి నాగలింగం తెలిపిన విదంగా వరంగల్-2 డిపోకు చెందిన  వజ్ర బస్సు హైదరాబాద్ నుండి వరంగల్ కు కొనసుగుతున్న విషయం అందరికి తెలిసినదే అయితే అప్పుడు బస్సు వరంగల్ నుండి  హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి వెళ్తోంది. బస్సు స్టేషన్‌ఘన్‌పూర్ మండలం  దాటగానే ఈ మధ్య ఏర్పాటు చేస్తున్న కొత్త రోడ్ల దృష్ట్యా పాడైపోయిన రోడ్ కారణంగా  ఒక్కసారిగా కుదుపుకు లోనయింది. దీంతో అసహనానికి లోనైనా ప్రయాణికుడు నాగలింగం డ్రైవర్ ను చూడగా అతడు ఏదో లోకం లో ఉంది మాటి మాటికీ ఆ ట్యాబు ని చూడడంతో  అనుమానం వచ్చిన నాగలింగం డ్రైవర్‌కేసి చూడగా రూట్  కోసం ఉపయోగిస్తున్న ట్యాబు లో నీలి చిత్రాలు చూస్తున్నట్లు గమనించాడు.

వెంటనే బస్సును  ఆపి డ్రైవర్‌ను నిలదీశాడు. అయితే, డ్రైవర్‌ మాత్రం నాగలింగంనే బెదిరించే ప్రయత్నం చేశాడు నేనెప్పుడూ చూశానని,  నీకెందుకని అనడం తో అంతలో వచ్చిన  జనగామ డిపో లో  నాగలింగం ఉన్నతాధికారులకు   ఫిర్యాదు చేశాడు. దీనితో డ్రైవర్ నేనుచూడలేదని, రుజువు ఏమిటని  బుకాయిస్తుండటంతో ట్యాబ్‌లోని హిస్టరీ లో వెతకగా అన్ని అవే ఉన్నట్లు రుజువు అవ్వడం తో  అధికారులు  ఆగ్రహం తో మందలించారు నావిగేషన్ కోసం ఆర్టీసీ  ట్యాబ్‌లు ఏర్పాటు చేస్తే దాన్ని  నీలి చిత్రాల కోసం వాడుతావా అని ఏదైనా అపాయం జరిగితే ఏంటి పరిస్థితి అని  ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగలింగం ఫిర్యాదు అందుకున్న హెడ్ కానిస్టేబుల్ ఆర్టీసీ  ఉన్నతాధికారులకు ఫోన్ చేసి విషయాన్ని తెలిపారు అలాగే డ్రైవర్ పైన చర్య తీసుకోవాలని నాగలింగం కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: