దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు నిందితులకు జనవరి 2020లో శిక్ష అమలు చేసేందుకు జైలు అధికారులు సిద్ధం అవుతున్నారు. అయితే ఇప్పుడు జైలు అధికారులకు ఒక కొత్త సమస్య వచ్చిపడింది. నిర్బయ నిందితులను ఉరి తీసేందుకు తీహార్ జైలులో తలారి లేడు అని తెలుస్తుంది. దీంతో జైలు అధికారులు దేశ వ్యాప్తంగా ఏ జైలులోనైనా తలారి ఉన్నారా అని వెతకటం మొదలు పెట్టారు.
 


ఇప్పటికే నిర్భయ దోషులు అప్పీల్ చేసుకున్న క్షమాభిక్ష  పిటిషన్లు ఏవి కూడా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో వచ్చే నెలలోనే వారికి శిక్ష అమలు చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతికి  నిందితులు పెట్టుకున్న క్షమాభిక్షను ఆయన  కొట్టేస్తే.. కోర్టు బ్లాక్ వారెంట్ జారీ చేస్తుంది. కోర్టు నుంచి బ్లాక్ వారెంట్ జారీ అయిన తర్వాత ఏ క్షణాన్నైనా నిర్భయ నిందితులకు ఉరి తీయవచ్చు.  

 

Image result for నిర్భయ దోషులకు శిక్ష
 

తీహార్ జైల్లో చివరి సారిగా పార్లమెంట్ పై దాడి చేసిన అప్జల్ గురును ఉరి తీశారు. ఆ రోజు రాత్రికి రాత్రి జరిగిన పరిణామాలతో తలారి లేకుండానే జైలు అధికారులు ఉరికంబానికి ఉండే లివర్ ను లాగి శిక్ష అమలు చేయడం జరిగింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఖాళీగా ఉన్న తలారి పోస్టును భర్తీ చేయాలని ఉన్నతాధికారులకు నివేదించామని జైలు అధికారులు తెలిపారు. దేశంలో ఏ జైలులోనైనా తలారి ఉంటే తాత్కాలికంగా తీహార్ జైలుకు బదిలీ చేయించి శిక్ష అమలు చేసేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.


 
ప్రస్తుతం జైలు అధికారులు ఉరిశిక్షను అమలు చేసే తలారి కోసం తీవ్రంగా వెతుకులాట ప్రారంభించారు. ప్రస్తుతం దేశాన్ని దిశ ఘటన కుదుపు కుదిపేసిన విషయం తెలిసిందే. దీంతో నిర్భయ ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. దిశ ఘటనతో నిర్భయ నిందితులకు త్వరగా ఉరిశిక్ష అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2020 జనవరిలో వారికి ఉరి శిక్ష అమలు చేయడం ఖాయమని తీహార్ జైలు అధికారుల ద్వారా తెలియచేయడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: