అమ్మంటే కనిపించే దైవం అంటారు. దేవుడున్నాడు అనే నమ్మకాన్ని అమ్మ నిలుపుతుంది అంటారు.. త్యాగానికి మారు పేరు అమ్మతనం. నిజమే కదా! అమ్మంటే వెలుగునిచ్చు కొవ్వొత్తిగా కరుగుతుంది. తనకోసం చూసుకోని గుణమే అమ్మంటే. తన బిడ్డల క్షేమమే ఆమె సంతోషం. స్త్రీగా జన్మించిన ప్రతివారు అమ్మలోని కమ్మదనాన్ని వద్దను కుంటారా. కాని కొందరు తల్లులు అమ్మ అనే పదాన్నే చంపేస్తున్నారు. అమ్మతనానికి మాయని మచ్చలా నిలిచిపోతున్నారు.

 

 

పిల్లలు కనడం ఇష్టంలేని కొందరు తల్లులు చేస్తున్న ఈ దురాగతం గురించి తెలిస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. యద తన స్వ్వడిని మరచి ఇలాంటి వారి కోసమా నా హృదయ స్పందన అని సిగ్గుపడుతుంది. పసిబిడ్డ పుట్టగానే పొత్తిళ్లలోకి తీసుకుని చనుబాలు ఇచ్చి ప్రాణం పోయాల్సిన తల్లులు కొన్నిరకాల పానీయాలు తాగించి ఊపిరి ఆపేస్తున్నారు. ఇంతటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న దేశం కెన్యా. ఇక్కడ చోటుచేసుకుంటున్న ఈ దారుణాల గురించి ‘టెలిగ్రాఫ్’ వార్తా సంస్థ వెల్లడించిన విస్తుపోయే నిజాల గురించి తెలుసుకుంటే. అబార్షన్లు చేయించుకోవడాన్ని కెన్యాలో నేరంగా పరిగణిస్తున్నారు.

 

 

దీంతో అక్కడి మహిళలు బిడ్డ పుట్టగానే చనుబాలు ఇవ్వకుండా ఆ పానీయాలు తాగిస్తున్నారు. వాటి వల్ల పిల్లల్లోని అవయవాలు దెబ్బతిని క్షణాల్లో కన్ను మూస్తున్నారు. ఇక ఆ పసివారు మరణించారని నిర్దారించుకున్న తర్వాత ఆ కళేబారాలను చెత్తకుప్పలు, నదులు, లేదా కాలువల్లో పడేస్తున్నారు. కెన్యాలో పేదరికం వల్ల పిల్లలను పోషించలేని పరిస్థితులు ఉన్నాయని, ఒకవేళ పొరపాటున గర్భం దాల్చితే అబార్షన్ చేయించు కోలేని పరిస్థితుల్లో ఈ ఘోరాలకు తెగబడుతున్నారని ఆ ప్రాంతానికి చెందిన ఓ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది.

 

 

ఇలా ఇప్పటివరకు చాలా మృత కళేబారాలను కనుగొన్నారట. ఇకపోతే అక్కడి ప్రభుత్వం వల్ల ఇలాంటి విషపు పానీయాలను నిలువరించడం అవడం లేదట. ఇదే కాకుండా అక్కడ నిరక్షరాసులే ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యం పట్ల సరైన అవగహన లేక గర్భం దాల్చి ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని అంటున్నారు. నిజంగా ఇదెంత దారుణం  లోకాన్ని చూడకుండానే ఎంతమంది శిశువులు కన్ను మూస్తున్నారు. పాపం వారు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: