తెలంగాణలోని సైబరాబాద్‌లో 27 ఏళ్ల మహిళపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన విషయంపై దేశం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం రాత్రి ఢిల్లీకి ఉన్నతస్థాయి వ్యక్తి కూతురు వివాహానికి హాజరయ్యారు. డిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తరువాత, వివాహ ఒక ప్రముఖ నేషనల్ మీడియాకు చెందిన జర్నలిస్ట్ ప్రశ్నకు సీఎం కెసిఆర్ షాక్ అయ్యారు, ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే విమానాశ్రయం నుంచి వెళ్లిపోయారు కెసిఆర్.

 

"సీఎం గారు ఢిల్లీలో పెళ్లికి వచ్చిన మీకు.. దిశా ఇంటికి పరామర్శకు వెళ్లే టైం లేదా" అంటూ టైమ్స్ నౌ న్యూస్ జర్నలిస్ట్ సీఎం కెసిఆర్ ను ప్రశ్నించారు. ఊహించని ఈ పరిణామానికి షాక్ తిన్న సీఎం కెసిఆర్ ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. 

 

దేశవ్యాప్తంగా ఆగ్రహం, నిరసనలు రేకెత్తించిన పశువైద్యురాలుపై అత్యాచారం, హత్య కేసును పరిష్కరించడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదివారం ఆదేశించారు. దారుణమైన సంఘటనను ఖండిస్తూ, నిందితులను ఫాస్ట్ ట్రాక్‌లో విచారించాలని, నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. 

 

"మహిళా పశువైద్యురాలు దారుణ హత్య కేసులో నిందితులను ఫాస్ట్‌ట్రాక్‌లో విచారించాలని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని సిఎం అధికారులకు సూచించారు. ఈ కేసును పరిష్కరించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని సిఎం నిర్ణయించారు ”అని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.

 

నవంబర్ 27 న, హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర తోండుపల్లి టోల్ ప్లాజా సమీపంలో మహిళపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసారు. పశువైద్యురాలిని కాల్చిన మృతదేహం హైదరాబాద్-బెంగళూరు హైవేలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి సమీపంలో కనుగొనబడింది. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు పురుషులు, 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న లారీ కార్మికులను అరెస్టు చేసి, శనివారం 14 రోజుల పాటు కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. ప్రస్తుతం నిందితులు చర్లపల్లి జైల్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: