రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌పై చేసే విమ‌ర్శ‌ల‌కు మంచి రేటింగ్ ఉంటుంది. స‌బ్జెక్ట్ వారీగా చేసే విమ‌ర్శ‌లకు ప్ర జ‌ల నుంచి మంచి స్పంద‌న కూడా వ‌స్తుంటుంది. నిర్మాణాత్మ‌క విమ‌ర్శ‌ల‌కు రాజ‌కీయాల్లో ఎప్పుడూ స్థానం ఉంటుంది. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి గాడి త‌ప్పుతోంది. నిర్మాణాత్మ‌కం స్థానంలో వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు ప్రా ధాన్యం పెరుగుతోంది. అయితే, ఇదేదో.. చిన్నా చిత‌కా వ్యూహాల‌తో ఏర్పాటు చేసుకున్న పార్టీ విష‌యంలో అయితే, పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. కానీ, మార్పు తెస్తాన‌ని పార్టీ పెట్టి ప‌వ‌న్ క‌ళ్యాణ్ దారి కూడా ఇదే విధంగా ఉండ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఈ ఏడాది ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత పార్టీని అస‌లు ఉంచుతారా?

 

లేక ఏదైనా పార్టీలో విలీనం చేస్తారా? అనే సందేహాలు ముసురుకున్నాయి. ఈ ప‌రిణామం జ‌న‌సేన పార్టీకి పెను విప‌త్తుగా మారింద‌నే అనుకున్నా రు. అయితే, త‌న ఓట‌మిని, త‌న పార్టీ ఓట‌మిని కూడా అతి త‌క్కు వ స‌మ‌యంలోనే ప‌క్క‌న పెట్టిన ప‌వ‌న్‌.. అనూహ్యంగా త‌న మాట‌ల దాడితో మీడియాలో నిలుస్తు న్నారు. ఒక‌ప్పుడు.. ప్ర‌జ‌లు గుర్తించ‌ని పార్టీల‌కు, నాయ‌కులకు (అంటే ఎన్నిక‌ల్లో ఓట్లు ప‌డ‌ని వారు) మీడియాలో పెద్ద‌గా గుర్తింపు ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ, ఇటీవ‌ల రాజ‌కీయాలు వ్య‌క్తిగ‌తానికి ప్రాధాన్యం ఇస్తున్న నేప‌థ్యంలో ఓట‌మి కూడా గెలుపున‌కు పునాదేనోయ్‌.. అన్న‌ట్టుగా మీడియా ప్ర‌చారం ఎక్కువ‌గానే సాగు తోంది.

 

ఇక‌, ప‌వ‌న్ విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఆయ‌న టార్గెట్ చేస్తున్న విదానం అం దరికీ తెలిసిందే. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు త‌న‌పై చేయొద్ద‌ని చెబుతూనే.. జ‌గ‌న్‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్వ‌లు చేయ డం ప‌వ‌న్‌కు అలవాటుగా మారిపోయింది. తాజాగా రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని కీల‌క విమ‌ర్శ‌లు చేశారు. జైలుకు వెళ్ల‌డం ఇంగ్లిష్ నేర్పిందా? అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. దీనికి పా ర్టీ అభిమానుల నుంచి ఈల‌లు మోగి ఉండొచ్చు.. సానుభూతి ప‌రుల నుంచి చ‌ప్ప‌ట్టు రాలి ఉండొచ్చు.

 

కానీ, సోష‌ల్ మీడియాలో మాత్రం పెద్ద‌గా రేటింగ్ ఏమీ పెర‌గ‌లేదు. ప‌వ‌న్ త‌న‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయొ ద్ద‌ని చెబుతున్న‌ప్పుడు.. తాను మాత్రం ఇలా వ్యాఖ్య‌లు చేయొచ్చా? అనేది మేధావుల ప్ర‌శ్న‌ల ప‌రం పర‌. మ‌రి ఇది ఏ త‌ర‌హా విన్యాస‌మో.. ఆయ‌నే చెప్పాలి. మాట‌ల దాడితో ప్ర‌చారం క‌ల్పించుకోవ‌డం వ‌ల్ల క్షేత్ర స్థాయిలో ఆశించిన ప్ర‌యోజ‌నం జ‌ర‌గ‌ద‌నే విష‌యాన్ని గ్ర‌హించాల్సిన అవ‌స‌రం ఉంది. జ‌గ‌న్‌పై ప‌స‌లేని విమ‌ర్శ‌ల వ‌ల్ల ప‌వ‌న్ గ్రాఫ్ మ‌రింత త‌గ్గింద‌న్న‌దే ఎక్కువుగా వినిపించే చ‌ర్చ‌.

మరింత సమాచారం తెలుసుకోండి: