ఈ మద్య టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటున్న విషయం తెలిసిందే.  ఇక స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ద్వారా చాలా మంది ఔత్సాహికులు తమకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నారు..నేర్చుకుంటున్నారు. కొత్త కొత్త విషయాలు అర్థం చేసుకొని తాము కూడా కొత్త విషయాలు కనిపెడుతున్నారు.  తాజాగా ఓ రైతు చేసిన పని చూస్తే నిజంగా ఔరా అని అంటారు. ఇంతకీ ఆ రైతు చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా కొంత కాలంగా తన పొలంలో నానా ఇబ్బందులు పెడుతున్న కోతులను ఒక్క ఉపాయంతో తరిమి కొట్టాడు. సాధారణంగా అరటి తోటల్లో కోతుల బెడద చాలా ఉంటుంది.. ఇవి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అరటికాయలు అందినంత తెంపి వేయడం..ఇష్టమైతే తినడం లేదా చుట్టూ వెదజల్లడం లాంటివి చేస్తుంటాయి.

 

 కర్నాటక రాష్ట్రం శివమొగ్గ ప్రాంతం నల్లూరు గ్రామానికి చెందిన రైతు తన అరటి తోటలో అరటి కాయలను కోతులు తిని వేయడమే కాకుండా ధ్వంసం చేస్తున్నాయి.  వాటిని తరిమి కొట్టాని చూస్తే మీద పడి రక్కే ప్రమాదం కూడా ఉంటుంది.  పిట్టలను ఇతర జంతువులను ఎన్నో రకాలుగా పంట పొలాల నుంచి పంపొచ్చు..కానీ ఈ కోతుల బెడత ఎలా అని ఆ రైతు ప్రతిరోజూ నరక యాతన పడుతున్నాడు.  ఇదే సమయంలో అతనికి వచ్చిన ఆలోచన అద్భుతం చేసింది.  తన వద్ద ఉన్న పెంపుడు కుక్కకు పులిలా వేషం వేసి అరటి తోటలో వదిలాడు.  అంతే తోటలోకి పులి వచ్చిందని భయంతో అటు వైపు కొతులు రావడం మానేశాయి.  

 

దాంతో తన ప్లాన్ వర్క్ ఔట్ అయ్యిందన్న సంతోషంతో రోజూ పలుమార్లు ఆ కుక్కను తన తోటలో తిప్పడం మొదలు పెట్టాడు. ఇంకేముంది ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే ఆ రైతు చేసిన ఉపాయంతో కోతులను ఇట్టే తరిమేయొచ్చు అన్న ఆలోచనలో ఇతర రైతులు ఉన్నారు. అందరూ రైతులు అలానే చేస్తే కోతులు పసిగట్టలేవా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ రైతుకు కోతుల బెడద తప్పింది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: