దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే  సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. భారీగా పెరిగిన ధరలు సామాన్యులు బెంబేలెత్తిస్తున్నాయి.సామాన్యులు  చూడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉల్లి  వైపు చూడాలంటేనే సామాన్యుడు భయపడుతున్నారు. అయితే ఉల్లి ధరలు సామాన్యులకు భారంగా కాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై అందిస్తున్నాయి. ఏకంగా ఉల్లి ధరలు వంద రూపాయలకు చేరడంతో సామాన్యుడు ఉల్లి  లేకుండానే వంటలు కానిచ్చేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉల్లి ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 

 

 

 

అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లి ధరలు సామాన్యులకు భారంగా కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సబ్సిడీ కింద  కేవలం 25 రూపాయలకు ఉల్లిని అందించాలని  నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ఉల్లిని 25 రూపాయల సబ్సిడీ కింద అందజేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు ప్రాంతాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకొని రాష్ట్ర ప్రజలకు అందించాలని నిర్ణయించారు . అయితే రాష్ట్రంలోని రైతు బజార్లు అన్నింట్లో 25 రూపాయలకు ఉల్లిని  అందుబాటులో ఉంచేందుకు నిర్ణయించింది.  అయితే ఒక్కో  వినియోగదారులకు  ఒక కిలో ఉల్లి మాత్రమే ఇచ్చేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. 

 

 

 

 అయితే ఉల్లి ధరలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం  జగన్మోహన్రెడ్డి ఉల్లి ధరలను ₹25 పేద ప్రజలకు అందించాలని సూచించారు. కేవలం ఇరవై ఐదు రూపాయలకే ఉల్లిని  అందుబాటులో ఉంచాలని సూచించారు. అయితే ఉల్లిపాయలను బ్లాక్ చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అయితే ఉల్లి ధరలు  దేశ వ్యాప్తంగా భారీగా పెరగడం పై సమీక్ష నిర్వహించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరికీ ఉల్లిని ఇరవై ఐదు రూపాయలకే అందుబాటులో ఉంచాలని రైతు బజార్లలో  విక్రయించాలని  ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: