మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించిచేసిన వ్యాఖ్యలకు జాతీయ  మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఉన్నత  స్థానాల్లో ఉన్నవారు తమకొచ్చిన సమాచారామ్ లో నిజానిజాలను  తెలుసుకొని మాట్లాడాలని అని చెప్పారు.రేఖ శర్మ మాటలకూ సమాధానం ఇస్తూ సీఎం కేసీఆర్ మహిళలను అగౌరవ పరిచేవిదంగా విధంగా ఎక్కడా మాట్లాడలేదు అని  స్పష్టం చేశారు. ‘మహిళలు, ఉద్యోగిణిలు రాత్రి 8 గంటల లోపే విధులు ముగించుకొని ఇళ్లకు చేరుకోవాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు  ఆశ్చర్యానికి  గురిచేశాయి.

 

రాత్రి 8 గంటల్లోపు ఇంట్లో ఉండటానికి వాళ్లేమైనా జీవితఖైదీలా? ఇంట్లో ఉంటే మహిళలపై నేరాలు జరగవా?’  వారికి భద్రతా కలిగిస్తున్నార? అంటూ రేఖా శర్మ సోమవారం   కేసీఆర్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేసారు ... ‘సమాజంలో మహిళలకూ కూడా సమాన హక్కులు ఉన్నాయి. సీఎం కేసీఆర్‌కు ఈ విషయం తెలిసేలా చేస్తాం..’ అంటూ ఆమె ట్వీట్‌ చేసారు ..

 

రేఖా శర్మ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్.. మహిళలను కించపరిచేలా తెలంగాణ ముఖ్యమంత్రి  మాట్లాడిన మాటల్లోమహిళలను  కించ పరిచే విదంగా  వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు . కొన్ని మీడియా సంస్థలు బాధ్యతా రాహిత్యంగా తమ టీఆర్‌పీ రేట్లను పెంచుకోవడానికి ఎలా పడితే ఆలా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని తెలిపారు.‘మేండం.. మీరు అత్యున్నత పదవిలో ఉన్నారు. ఇలాంటి వాటిపై స్పందించే ముందు దయచేసి నిజం తెలుసుకొని  స్పందించాలని  కోరుతున్నా.  అంటూ ’  కేటీఆర్ ట్వీట్ చేశారు.

 

ఆదివారం ఆర్టీసీ కార్మికులతో సమావేశం సందర్భంగా ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగులకు 8 గంటల లోపే విధులు ముగించుకునేలా డ్యూటీ చార్ట్‌లు ప్రిపేర్ చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగులు 5 వేల మంది కూడా లేరని.. ఇదేమంత పెద్ద కష్టతరమైన  విషయం కాదని కేసీఆర్ తెలిపారు.మహిళా కండక్టర్లు రాత్రి 11 గంటల దాకా విధుల్లో ఉంచి ఇబ్బంది పెట్టడం ఎందుకు? వారిని కాస్త తొందరగా ఇళ్లకు పంపించేద్దామని కేసీఆర్ ప్రకటించారు. దీనికి మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: